Begin typing your search above and press return to search.

LTTE మోస్ట్ వాంటెడ్ తీవ్ర‌వాది వేలుపిళ్లై ప్రభాకరన్ గా సేతుప‌తి?

By:  Tupaki Desk   |   22 Oct 2020 12:30 PM GMT
LTTE మోస్ట్ వాంటెడ్ తీవ్ర‌వాది వేలుపిళ్లై ప్రభాకరన్ గా సేతుప‌తి?
X
ఇటీవ‌ల వ‌రుస బ‌యోపిక్ వార్త‌ల‌తో మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌నే శ్రీ‌లంక స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ ని ప్ర‌క‌టించి అనూహ్యంగా ఆ మూవీ నుంచి వైదొల‌గిన‌ట్టు ప్ర‌క‌టించి హీట్ పెంచిన విజ‌య్ సేతుప‌తి ఇంత‌లోనే మ‌రో ఆస‌క్తిక‌ర బ‌యోపిక్ కి సంత‌కం చేశార‌న్న వార్త‌లు అంత‌ర్జాలంలో మంట‌లు పెట్టేస్తున్నాయి.

LTTE మోస్ట్ వాంటెడ్ తీవ్ర‌వాది (ముద్ర వేయ‌బ‌డ్డారు) వేలుపిళ్లై ప్రభాకరన్ గా సేతుప‌తి న‌టిస్తున్నార‌న్న‌దే తాజా వార్తాక‌థ‌న‌ సారాంశం. ప్రభాకరన్ జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ కోసం ప్రధాన పాత్ర పోషించడానికి విజయ్ సేతుపతితో మేక‌ర్స్ చ‌ర్చ‌లు ప్రారంభించార‌ట‌. ఎర్ర‌చందనం స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఆధారంగా మూవీ.. అలాగే రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా రూపొందించిన చిత్రాల‌తో పాపుల‌ర్ బ‌యోపిక్ డైరెక్ట‌ర్ గా పేరుగాంచిన ఎఎంఆర్ రమేష్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తారని సమాచారం.

ప్రముఖ రాజకీయ నాయ‌కుల‌పై సినిమాలకు దర్శకత్వం వహించిన పేరున్న దర్శకుడు ఎ.ఎం.ఆర్ రమేష్ బ‌రిలో దిగ‌డంతో ప్ర‌భాక‌ర‌న్ బ‌యోపిక్ పైనా ఆస‌క్తి పెరిగింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ జీవితం ఒక తెరిచిన పుస్త‌కం లాంటిది. ఇది ఛాలెంజ్ లాంటిదేన‌న్న సంగ‌తి తెలిసిన‌దే. దర్శకుడు ర‌మేష్‌ ఇప్ప‌టికే విజయ్ సేతుపతితో ప్రభాకరన్ పాత్రలో నటించాల్సిందిగా సేతుప‌తితో చర్చలు జరుపుతున్నాడు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంద‌ని కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందించాల్సిన‌ బయోపిక్ 800 నుండి విజయ్ సేతుపతి వైదొలిగిన తరువాత ఈ ప్రాజెక్టుపై చ‌ర్చ సాగించ‌డ ం ఆస‌క్తిని పెంచుతోంది. 800 మోషన్ పోస్టర్ ‌ను విడుదల చేసిన తరువాత సేతుప‌తిపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిన‌దే. ఈ చిత్రం నుండి వైదొలగాలని పలువురు ప్రముఖులు విజయ్ సేతుపతిని అభ్యర్థించారు. ఇంత‌లోనే ప్రభాకరన్ బ‌యోపిక్ గురించి ఈ వార్త ఊహించని విధంగా బ‌య‌ట‌కు వచ్చింది.

మ‌రోవైపు విజయ్ సేతుపతి ఇప్ప‌టికే కెరీర్ ప‌రంగా పూర్తి బిజీ. ద‌ళ‌ప‌తి విజయ్ న‌టిస్తున్న `మాస్టర్ `లో ప్రధాన విల‌న్ గా న‌టిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లను తిరిగి తెరిచిన తరువాత మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం తాప్సీ పన్నూతో క‌లిసి సేతుప‌తి వేరొక చిత్రంలో న‌టిస్తున్నారు. ఇంకా టైటిల్ ప్ర‌క‌టించ‌ని ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శ్రుతి హాసన్ తో లాభం.. రాశి ఖన్నాతో తుగ్లక్ దర్బార్ చిత్రాలు చేస్తున్నారు సేతుప‌తి.