Begin typing your search above and press return to search.

'మక్కల్ సెల్వన్' అల్ట్రా స్టైలిష్ ట్రెండీ లుక్..!

By:  Tupaki Desk   |   24 April 2021 12:30 AM GMT
మక్కల్ సెల్వన్ అల్ట్రా స్టైలిష్ ట్రెండీ లుక్..!
X
సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలకు హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు. ఎలాంటి భాషాబేధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే సూపర్ డీలక్స్ సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్నాడు విజయ్ సేతుపతి. అలాగే ఈ ఏడాది దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషించి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. రీసెంట్ గా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ విలన్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకు కూడా విజయ్ ఖాతాలో మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు విజయ్ కేవలం సౌత్ లాంగ్వేజస్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తనకు నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయినా పోషించడానికి విజయ్ సేతుపతి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ప్రస్తుతం విజయ్ చేతినిండా దాదాపు పది సినిమాలకు పైగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే సౌత్ ఇండియన్ మోస్ట్ బిజీస్ట్ యాక్టర్ గా మెప్పు పొందుతున్నాడు. నిజానికి విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ కాదు. కానీ ఆయనకు సంబంధించిన వార్తలు, ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఈ స్టార్ యాక్టర్ స్టైలిష్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎల్లప్పుడూ డిఫరెన్స్ కోరుకునే మక్కల్ సెల్వన్ ఈసారి ఫోటోషూట్ కూడా డిఫరెంట్ అండ్ స్టైలిష్ గా కానిచ్చాడు. కలర్డ్ హెయిర్ స్టైల్ తో పాటు అల్ట్రా స్టైలిష్ డ్రెస్ లో ఫోటోలకు పోజులిచ్చాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ న్యూ ఫోటోషూట్స్ అప్ కమింగ్ మూవీకోసమే అని టాక్. చూడాలి మరి ఏ సినిమాలో ఈ నయా లుక్కులో అలరిస్తాడో..!