Begin typing your search above and press return to search.
చేతినిండా సినిమాలే..ప్రతి నెలా ఆయన బొమ్మ థియేటర్లో పడాల్సిందే!
By: Tupaki Desk | 11 Jan 2021 1:00 PM ISTవిజయ్ సేతుపతి.. ఈ పేరు ఇప్పుడు ఒక కోలీవుడ్ మాత్రమే కాదు.. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అన్ని చోట్లా వినిపిస్తోంది. తమిళ జనాలు అతడిని మక్కల్ సెల్వన్ గా పిలుచుకుంటారు. హర్రర్ మూవీ పిజ్జాతో హిట్ కొట్టిన విజయ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దేశంలోనే బిజీ ఆర్టిస్ట్ ఎవరు అంటే గుర్తుకు వచ్చే పేరు విజయ్ సేతుపతి. విజయ్ ఒక హీరో పాత్రకే పరిమితం కావడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన చేతిలో ఏ నటుడు చేయనన్ని సినిమాలు ఉన్నాయి. భాషా భేదం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో ఆయన నటించిన సినిమాలు థియేటర్లలో క్యూ కట్టనున్నాయి. కనీసం నెలకు ఒక్క సినిమా అయినా థియేటర్ లోకి రానుంది. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు ముందు రోజు విడుదల కానుంది.
అలాగే ఆయన తెలుగులో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీలో ఓ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 9వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన లాభం సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఆయన తమిళంలో కడైసీ వివసాయి, ఇడం పొరుళ్ ఏవల్, మా మణిదన్, కాత్తువాక్కుల్, రెండు కాదల్, కరోనా కుమార్, ముగిళ్ ఇలా ఆయన నటించిన సినిమాలు నెలకు ఒకటి చొప్పున విడుదల కానున్నాయి.