Begin typing your search above and press return to search.
'ఆహా'లో విజయ్ సేతుపతి ''విక్రమార్కుడు''..!
By: Tupaki Desk | 5 July 2021 11:30 AM GMT100శాతం తెలుగు కంటెంట్ తో వచ్చిన ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా'.. ప్రతి వారం సరికొత్త కంటెంట్ ని వీక్షకులకు అందిస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలు - వెబ్ సిరీసలతో పాటుగా ఇతర భాషల్లోని సూపర్ హిట్ చిత్రాలను అనువాదం చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ''విక్రమార్కుడు'' అనే మరో సినిమాని స్ట్రీమింగ్ పెడుతున్నట్లు వెల్లడించారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'జుంగా'. తమిళ్ సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని ''విక్రమార్కుడు'' పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. 'ది రియల్ డాన్' అనేది దీనికి ట్యాగ్ లైన్. 'అఖిల్' బ్యూటీ సాయేషా సైగల్ - 'ప్రేమమ్' ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి 'విక్రమార్కుడు' చిత్రానికి సంబంధించిన పాటలు - ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలో 'విక్రమార్కుడు' చిత్రాన్ని 'ఆహా' ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జూలై 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ పెడుతున్నట్లు వెల్లడించారు.
'కాస్మోరా' ఫేమ్ గోకుల్ 'విక్రమార్కుడు' చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి సిద్దార్థ సంగీతం సమకూర్చారు. వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ - క్రాంతి కీర్తన పతాకాలపై కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్ - అప్పసాని సాంబశివరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఈ నెల 9న 'ఆహా'లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.