Begin typing your search above and press return to search.
బాబోయ్ వంద కోట్లా... మనోళ్లందరిని మించేశాడు
By: Tupaki Desk | 21 Feb 2020 5:15 AM GMTపదేళ్ల క్రితం హీరోల పారితోషికంను ఇప్పుడు హీరోలు తీసుకుంటున్న పారితోషికంను పోల్చి చూస్తే డబుల్.. త్రిబుల్ కొందరు అయితే ఏకంగా పది రెట్ల అధిక పారితోషికంను కూడా తీసుకుంటున్నారు. మన తెలుగు హీరోల పారితోషికం ఆకాశాన్ని అంటింది అంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళ హీరోల పారితోషికాలతో పోల్చితే మన హీరోల పారితోషికాలు తక్కువే. తమిళ స్టార్ హీరో విజయ్ తన ఒక్క సినిమాకు వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు.
ఈమద్య కాలంలో ఈయన నటించిన ప్రతి సినిమా కూడా సక్సెస్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఈజీగా 150 కోట్లను వసూళ్లు చేసింది. అందుకే ఈయన పారితోషికం పెంచుతూనే పోతున్నాడు. బిగిల్ చిత్రానికి దాదాపుగా 70 కోట్లు తీసుకున్న విజయ్ ఇప్పుడు మాస్టర్ చిత్రం కోసం ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మొత్తం ఆయనే తీసుకున్నాడు. అక్కడ వంద కోట్లకు మించి బిజినెస్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
తమిళంతో పాటు కేరళలో కూడా విజయ్ కి మంచి మార్కెట్ ఉంది. ఈమద్య తెలుగులో కూడా ఈయన మెల్ల మెల్లగా జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక శాటిలైట్ ఓటీటీ రైట్స్ ద్వారా కోట్లు కుమ్మరించేందుకు బయ్యర్లు సిద్దంగా ఉన్నారు. ఆ కారణంగానే విజయ్ సినిమాకు నిర్మాతలు ఎంత పెట్టేందుకు అయినా సిద్దంగా ఉంటున్నారు. విడుదలకు ముందే ఈజీగా 150 కోట్ల బిజినెస్ చేస్తుంది. అందులో వంద కోట్లు విజయ్ పారితోషికం అవ్వగా 30 నుండి 40 కోట్లు సినిమా ఇతర బడ్జెట్. నిర్మాతకు 10 కోట్లు లాభం. సినిమా సక్సెస్ అయితే ఆ లాభాలు మరింత పెరుగుతాయి. ఇలా తమిళనాడులో విజయ్ సినిమా లెక్కలు సాగుతున్నాయి.
ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఇంతటి పారితోషికం తీసుకుంటున్న హీరో ఎవరు లేరు. ఇండియా మొత్తం మీదా ముగ్గురు నలుగురు మాత్రమే ఈ రేంజ్ పారితోషికం తీసుకుంటున్నారంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ మాస్టర్ సినిమా సక్సెస్ అయితే ఏ రేంజ్‌లో రెమ్యూనరేషన్ పెంచుతాడో చూడాలి.