Begin typing your search above and press return to search.

విజయ్ చేసిన పనికి దిల్ రాజు ఫిదా

By:  Tupaki Desk   |   3 Jan 2023 1:30 AM GMT
విజయ్ చేసిన పనికి దిల్ రాజు ఫిదా
X
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొదటిసారి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వారసుడు అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ హీరోకు అందరికంటే ఎక్కువ స్థాయిలో 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ఇంతకుముందు అనేక రకాల కథనాలు వచ్చాయి. తమిళంలో వారిసు పేరుతో విడుదలవుతున్న ఈ సినిమా తెలుగులో వారసుడు అనే టైటిల్ తో రిలీజ్ అవుతోంది.

ఈ సంక్రాంతికి తప్పకుండా తెలుగులో కూడా మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. అయితే తమిళంలో మాత్రం దిల్ రాజు థియేట్రికల్ రైట్స్ మొత్తం కూడా అమ్మేసుకున్నాడు. ఇక అక్కడ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దిల్ రాజు అక్కడ ఆ వేదికపై ఇంగ్లీషులో మాట్లాడిన విధానం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను మొదట విజయ సార్ ను కలవడానికి వచ్చినప్పుడు ఆయన క్యాబిన్లో ఎదురుచూస్తూ ఉన్నాను. ఇక ఆయన డోర్ తీసుకొని వచ్చి నా చేతికి కాఫీ కప్పు ఇచ్చారు. అది నాకు ఒక మంచి సర్ప్రైజ్ అనిపించింది. ఆ విజువల్స్ ఇంకా నా మైండ్ లోనే ఉన్నాయి.

నేను మెగాస్టార్ అలాగే సూపర్ స్టార్స్ తో కూడా తెలుగులో సినిమాలు చేశాను. కానీ ఇలాంటి అనుభూతి నాకు ఎప్పుడూ ఎక్స్ పీరియన్స్ చెందలేదు అంటూ దిల్ రాజు చాలా సింపుల్ గా ఒక వివరణ అయితే ఇచ్చాడు. అంతా బాగానే ఉంది కాని అసలే దిల్ రాజు ఈ మధ్య ఏం మాట్లాడినా కూడా చాలా వైరల్ గా మారిపోతుంది.

ఇక ఇప్పుడు మెగాస్టార్ సూపర్ స్టార్ ఆ ట్యాగ్ లతో చేసిన ఈ తరహా కామెంట్స్ ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయి అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా కూడా దిల్ రాజు అందరి హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అనేది తెలిసిన విషయమే. వీలైనంతవరకు ఏదైనా సమస్య ఉంటే కూర్చుని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని కూడా దిల్ రాజు చాలా గట్టిగా చెబుతూ ఉంటాడు. ఇక వారసుడు సినిమా సంక్రాంతి ఫైట్ లో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.