Begin typing your search above and press return to search.
తెలుగు లో మరో ప్రయత్నం చేయబోతున్న తమిళ సూపర్ స్టార్
By: Tupaki Desk | 19 April 2023 12:01 PM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ మొన్న సంక్రాంతికి వారిసు/వారసుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. వారిసు తమిళంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ తెలుగులో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. మినిమం గా కూడా వసూళ్లు నమోదు అవ్వలేదు.
వారసుడు నిరాశ పర్చినా కూడా వారిసు ఇచ్చిన ధైర్యంతో విజయ్ మరో తెలుగు.. తమిళ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ద్వి భాష చిత్రాన్ని చేసేందుకు గాను విజయ్ ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
వీర సింహా రెడ్డి సినిమా తర్వాత ఒక మాస్ మసాలా స్క్రిప్ట్ ను విజయ్ కి చెప్పి ఓకే చెప్పించిన దర్శకుడు గోపీచంద్ మలినేని త్వరలోనే సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండటంతో పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమా ఉండటం అంటే కాస్త ఎక్కువ కష్టమే. అయినా కూడా దర్శకుడు గోపీచంద్ మలినేని కాస్త రిస్క్ తీసుకుని విజయ్ తో సినిమాను చేసేందుకు సిద్ధం అయ్యాడు. వీర సింహారెడ్డి సినిమా విజయంతో గోపీచంద్ మలినేని కి మంచి క్రేజ్ దక్కింది.
విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా మరియు ఆ తర్వాత కమిట్ అయిన సినిమా కూడా పూర్తి అయిన తర్వాత గోపీచంద్ మలినేని సినిమా ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
తెలుగు లో ఈసారి అయినా విజయ్ కి మంచి విజయం సాధ్యం అవుతుందా అనేది చూడాలి. వారసుడు విషయంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ ద్విభాషా చిత్రం అక్కడ ఇక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.