Begin typing your search above and press return to search.
సీఎం కేసీఆర్ ను కలిసిన స్టార్ హీరో.. కథేంటి?
By: Tupaki Desk | 18 May 2022 4:27 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ను తమిళ స్టార్ హీరో విజయ్ కలిశారు. హైదరాబాద్ వచ్చిన విజయ్.. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో విజయ్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. వీరిని ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు స్వయంగా సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హీరో విజయ్ ను సీఎం కేసీఆర్ శాలువతో సన్మానించారు.
ఈ సందర్భంగా హీరో విజయ్ ను సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. విజయ్ ను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం హీరో విజయ్ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. సినిమాను తమిళంతోపాటు తెలుగులో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నేపథ్యంలోనే హీరో విజయ్ హైదరాబాద్ వచ్చారు.
కాగా హీరో విజయ్ సినిమాలు తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతున్నాయి. 'అదిరింది', 'విజిల్', తుపాకీ, మాస్టర్, బీస్ట్ సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. మంచి ఆదరణ పొందాయి. హీరో విజయ్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.
కాగా స్టార్ హీరో విజయ్ తమిళనాట రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన తండ్రి పార్టీ స్థాపించినా కూడా ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక తమిళ రాజకీయాల్లోనూ ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను విజయ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సినిమా షూటింగ్ కోసం వచ్చాడని.. అంతే తప్ప ఇందులో రాజకీయం లేదని కొందరు అంటున్నారు.