Begin typing your search above and press return to search.

ద‌ళ‌పతి విజయ్ 2023 నికర ఆస్తుల‌ విలువ

By:  Tupaki Desk   |   15 Jan 2023 6:30 AM GMT
ద‌ళ‌పతి విజయ్ 2023 నికర ఆస్తుల‌ విలువ
X
ద‌ళ‌పతి విజయ్ త‌మిళ‌నాడు - తెలుగు రాష్ట్రాలు స‌హా అటు విదేశాల‌లోను భారీ ఫాలోయింగ్ ని క‌లిగి ఉన్న హీరో. ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరోగా ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇన్నేళ్ల‌లో అత‌డు పారితోషికాలు ప్ర‌క‌ట‌న‌ల రూపంలో కూడ‌బెట్టిన సంప‌ద విలువ ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే.. 2023 నికర విలువను ప‌రిగ‌ణించాలంటే.. అత‌డి వార్షిక ఆదాయం.. సముద్రతీరంలోని బంగ్లా.. ఖరీదైన కార్లు మరిన్ని లోతైన వివ‌రాలు తెలియాలి.

జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పూర్తి పేరు. రంగస్థలం పేరు ద‌ళ‌పతి విజయ్. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అతిపెద్ద సూపర్ స్టార్లలో ఒకరు. 10 సంవత్సరాల వయస్సులో అతడు 1984 లో తన తండ్రి SA చంద్రశేఖర్ చిత్రం `వెట్రి`తో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతను చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 7 చిత్రాలలో నటించాడు. రజనీకాంత్ తో `నాన్ సిగప్పు మనితన్` చిత్రంలో కూడా నటించాడు.

18 సంవత్సరాల వయస్సులో విజయ్ తన మొదటి చిత్రం `నాలయ్య తీర్పు`తో క‌థానాయ‌కుడిగా గుర్తింపు పొందాడు. విక్రమన్ దర్శకత్వం వహించిన చిత్రం పూవే ఉనక్కగా అతడికి పేరుతో పాటు ప్రజాదరణను తెచ్చిపెట్టింది. మిగిలినదంతా అజేయ‌మైన‌ చరిత్ర.

రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న విజ‌య్ భారీ అభిమానులను సంపాదించాడు. కోలీవుడ్ లో నమ్మ‌ద‌గిన‌ నటుడిగా హ‌వా సాగస్తున్నాడు. హద్దులు దాటి అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతర్జాతీయంగా కూడా గణనీయమైన అనుచ‌రులున్నారు. బహుశా అల్లు అర్జున్ కాకుండా కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక మలయాళీయేతర నటుడు విజయ్ మాత్రమే. వాస్తవానికి అతను కేర‌ళ‌లో అతిపెద్ద బాక్సాఫీస్ కింగ్ లలో ఒకడు. అతని థ్రిల్లర్ చిత్రం `తేరి` కేరళలో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. చాలా మలయాళ చిత్రాల కంటే ఉత్త‌మ వ‌సూళ్ల‌ను సాధించింది.

విజ‌య్ న‌ట‌న ఫ్రీ అండ్ ఫ్లో డ్యాన్సులు అతని అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. అలాగే భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో అత్యంత సంపన్న నటుడనే సంగ‌తి ఎంద‌రికి తెలుసు? దాదాపు 445 కోట్ల భారీ నికర ఆస్తులతో పాటు అనేక ఇత‌ర‌ ఖరీదైన ఆస్తులను కలిగి ఉన్నాడు.హై-ఎండ్ కార్లు స‌భా అత‌డి నిక‌ర ఆస్తుల విలువ‌ను ప‌రిగ‌ణిస్తే...!

విజయ్ 2023 నికర విలువ


వికీపీడియా GQ వివ‌రాల‌ ప్రకారం ద‌ళ‌పతి విజయ్ ప్రస్తుత నికర ఆస్తి విలువ 56 మిలియన్ డాలర్లు. అంటే రూ. 445 కోట్లు. సంవత్సరానికి రూ-120 నుండి 150 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.

విజయ్ అతిపెద్ద నటుడు..ప్రతి సినిమాకి భారీ పారితోషికం తీసుకుంటాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడుగా రికార్డుల‌కెక్కాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన బీస్ట్ చిత్రానికి100 కోట్ల పారితోషికం వసూలు చేశాడు. ఆ తర్వాత అతను తన 100 కోట్ల క్లబ్ ను కొనసాగించాడు. జనవరి 11 న విడుదలైన అతని తదుపరి చిత్రం `వారిసు` కి దాదాపు 150 కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకున్నాడని గుస‌గుసలు వినిపించాయి. ఈ చిత్రం అజిత్ కుమార్ న‌టించిన‌ తునివుతో బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టింది.

దళపతి విజయ్ `వారిసు` కోసం రూ. 150 కోట్లు వసూలు చేశాడనేది నిజ‌మే అయితే.. సౌత్ స‌హా బాలీవుడ్ స్టార్ల పారితోషికాల‌నే అధిగ‌మించింద‌ని అర్థం. అయితే అత‌డు ఎంత అడిగినా కాద‌న‌కుండా ఇచ్చేవాళ్ల‌కు కొద‌వేమీ లేదు. నిర్మాతలు -పెట్టుబడిదారులు విజయ్ పై మెగా-బడ్జెట్ లతో బెట్టింగుల‌కు సిద్ధంగా ఉన్నారు.

విజ‌య్ సెల‌క్టివ్ గానే బ్రాండ్ల జోలికి వెళుతుంటాడు. ర‌క‌ర‌కాల‌ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ల కోసం సంవత్సరానికి రూ. 10 కోట్లు సంపాదిస్తాడు. విజయ్ అనేక అంతర్జాతీయ బ్రాండ్లకు ప్ర‌చార‌క‌ర్త‌గా.. క్రీడా బృందాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

ద‌ళ‌పతి విజయ్ తన భార్య సంగీత సోర్నలింగం ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్ - దివ్య షాషాతో కలిసి విలాసవంతమైన సముద్రతీర బంగ్లాలో నివసిస్తున్నారు. నటుడి ఇల్లు చెన్నైలోని నీలంకరై పరిసరాల్లోని క్యాజురినా డ్రైవ్ వీధిలో ఉంది. విజయ్ విలాసవంతమైన నివాసం హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ బీచ్ హౌస్ నుండి ప్రేరణ పొంది నిర్మించారు. తన యుఎస్ పర్యటనలో విజయ్ టామ్ క్రూజ్ బీచ్ హౌస్ ను చూశాడు. అది ఆకట్టుకోవ‌డంతో విజయ్ కి ఇంటి నిర్మాణంపై క్లారిటీ వ‌చ్చింది. అలాంటి బీచ్ హౌస్ ను పునరావృతం చేశాడు. రిపోర్ట్ ప్రకారం ఇంటి వెలుపలి భాగం సహజమైన తెలుపు రంగులో రావడంతో క్లాసీగా కనిపిస్తుంది.

5 ఫిబ్రవరి 2020న ఆదాయపు పన్ను శాఖ చెన్నైలోని విజయ్ నివాసంపై దాడి చేసింది. అతను ప్రొడక్షన్ స్టూడియో AGS ఎంటర్ టైన్ మెంట్ నుండి వారసత్వంగా పొందిన స్థిరాస్తులలో అతని పెట్టుబడిని గమనించి పన్ను ఎగవేత రేంజు ఎంత అన్న దాని గురించి ఆరా తీసింది. మార్చి 12 న అధికారులు దాడిలో ముఖ్యమైన వివ‌రాలేవీ క‌నుగొన‌లేదు.

ద‌ళ‌పతి విజయ్ తెరపై తెర వెలుపల కింగ్-సైజ్ జీవితాన్ని గడుపుతాడు. అతను కొన్ని ఖరీదైన కార్లలో విహార‌యాత్ర‌ల‌కు వెళుతుంటాడు. అతను ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు గురించి ఎక్కువగా ఇష్ట‌ప‌డ‌తాడు. వాస్తవానికి తన కారు కారణంగా కూడా వివాదంలో చిక్కుకున్నాడు. తన రోల్స్ రాయిస్ కారుపై ఎంట్రీ ట్యాక్స్ చెల్లించనందుకు ద‌ళ‌పతి విజయ్ కి మద్రాస్ హైకోర్టు గతేడాది లక్ష రూపాయల జరిమానా విధించింది. తిరిగి 2012లో విజ‌య్... ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న తన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు కోసం పిటిషన్ దాఖలు చేశారు.

అతను తన గ్యారేజీలో అత్యాధునిక కార్లను కలిగి ఉన్నాడు BMW X5 -X6 అలాగే BMW X5 అండ్ X6.. ఆడి A8 L ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్.. ఫోర్డ్ ముస్తాంగ్, ...వోల్వో XC90 మెర్సిడెస్ బెంజ్ GLA... లాంటి ఖ‌రీదైన కార్ల‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. ద‌ళ‌పతి విజయ్ విద్యాభ్యాసం స‌మ‌యంలోనే నటుడిగా అరంగేట్రం చేసాక తండ్రి ప్రోత్సాహంతో న‌ట‌న వైపు దృష్టి సారించారు.

విజయ్ తమిళనాడులోని మద్రాసు (ప్రస్తుతం చెన్నై)లో జన్మించాడు. అతని తండ్రి S. A. చంద్రశేఖర్ చలనచిత్ర దర్శకుడు .. తల్లి శోభా చంద్రశేఖర్ నేపథ్య గాయని. కర్నాటక గాయకురాలు. అతను ఫాతిమా మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాడు. తరువాత విరుగంబాక్కంలోని బాలలోక్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరాడు. గ్రాడ్యుయేషన్ కోసం లయోలా కాలేజీ నుండి విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీని అభ్యసించారు. చదువుతున్నప్పుడు 18 సంవత్సరాల వయస్సులో విజ‌య్ ని త‌న‌ తండ్రి గారు హీరోని చేసారు.

విజయ్ 18 సంవత్సరాల వయస్సులో ప్రధాన నటుడిగా తన మొదటి చిత్రం `నాలయ్య తీర్పు`లో అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. విక్రమన్ దర్శకత్వం వహించిన చిత్రం పూవే ఉనక్కగా... అతనికి కీర్తి ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తలపతితో ఆగలేదు. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించాడు.

ఖుషీ - స్నేహితులు- తమిజన్ -గిల్లి- నాన్బన్- జిల్లా-తేరి-సర్కార్- బీస్ట్ లాంటి సినిమాల‌లో విజ‌య్ న‌టించాడు.వరిసు పూర్తి కుటుంబ క‌థా చిత్రంతో తీసిన సినిమా. ఇది అత‌డి రొటీన్ సినిమాల‌కు భిన్న‌మైన‌ది.