Begin typing your search above and press return to search.
వారిసు డిజాస్టర్.. దిల్ రాజు సేఫ్!
By: Tupaki Desk | 15 Jan 2023 5:30 AM GMTఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం వారిసు. చాలా కాలం తర్వాత హీరో విజయ్ నుంచి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. కార్పోరేట్ బ్యాక్ డ్రాప్ లో, ఉమ్మడి కుటుంబం నేపధ్యంలో బంధాలు, బాధ్యతలు గుర్తుచేస్తూ ఈ మూవీ కథని వంశీ పైడిపల్లి ఆవిష్కరించారు.
అయితే సినిమా కంటెంట్ పరంగా భాగానే ఉన్నా కూడా ఈ జెనరేషన్ లో చెప్పాల్సిన కథ కాదనే మాట వినిపిస్తుంది. 20 ఏళ్ళ బ్యాక్ లో ఇలాంటి కథలని ఆడియన్స్ భాగా కనెక్ట్ అయ్యేవారు. అయితే ప్రస్తుతం పబ్లిక్ అంతా కూడా మాస్, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ ఉండే కథలని మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఈ కారణంగా వారసుడు సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా తమిళ్ ప్రేక్షకులు ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఎక్కువగా కనెక్ట్ కాలేకపోయారు. ఇక సినిమాలో తమిళ్ యాక్టర్స్ ఉన్నా కూడా ఎమోషన్స్ అంతా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండటం కూడా వారిసు సినిమాకి మూడు రోజుల్లో డివైడ్ టాక్ రావడానికి కారణం అయ్యిందనే మాట వినిపిస్తుంది. మొదటి రోజు ఏకంగా 19.43 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజుకి 60 పెర్సెంట్ డ్రాప్ తో కేవలం 8.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
ఇక మూడో రోజు కూడా డ్రాప్ అయ్యి 7.11 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా మూడు రోజుల్లో ఈ మూవీ కలెక్షన్స్ 35.29 కోట్లు మాత్రమే. నిజానికి విజయ్ కి ఉన్న మార్కెట్ స్టామినాకి ఇపాతికే వంద కోట్లకి కలెక్షన్స్ సమీపించాలి. కాని వారిసు సినిమా అందుకు విరుద్ధంగా డిజాస్టర్ కలెక్షన్స్ రాబడుతూ విజయ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మారబోతుందని కోలీవుడ్ సినీ విశ్లేషకులు ట్వీట్ చేస్తున్నారు.
అయితే ఈ స్థాయిలో వారిసు మూవీ కోలీవుడ్ లో డిజాస్టర్ అయినా కూడా థీయాట్రికల్ రైట్స్ ముందుగానే అమ్మేయడంతో దిల్ రాజు ఆ సినిమా నష్టాల నుంచి తప్పించుకున్నాడు అనే మాట ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. అయితే టాలీవుడ్ లో మాత్రం వారసుడు నష్టాన్ని కచ్చితంగా దిల్ రాజు భరించాల్సి వస్తుందనే టాక్ నడుస్తుంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాని పెద్దగా అడాప్ట్ చేసుకునే ఛాన్స్ లేదనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.