Begin typing your search above and press return to search.

90 అడుగుల పైనుంచి దూకేశాడు

By:  Tupaki Desk   |   13 Feb 2016 1:32 PM GMT
90 అడుగుల పైనుంచి దూకేశాడు
X
ఫ్యాన్స్ ని అలరించడం కోసం హీరోలు ఏవైనా చేసేస్తూ ఉంటారు. కొత్త కొత్త గెటప్స్ - లుక్స్ - ఫ్యాషన్ కే పరిమితం కాకుండా.. తమ ఫ్యాన్స్ ని థ్రిల్ చేసేందుకు సాహసాలు కూడా చేసే అలవాటు కొంతమంది హీరోలకు ఉంది. ఇలాంటి సాహసాలు చేయడంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఇప్పుడు అందరికంటే ఒక అడుగు ముందుకెళ్లిపోయాడు.

ప్రస్తుతం తెరి అనే టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నాడు ఇళయదళపతి విజయ్. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఫుల్ ప్లెడ్జెడ్ గా యాక్షన్ బేస్డ్ గానే ఉంటుంది. ఇది రీసెంట్ గా విడుదలైన టీజర్ తో చెప్పేశారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా షూట్ చేసిన ఓ సన్నివేశం గురించి న్యూస్ తెలిసింది. తాజాగా తెరి కోసం గోవాలో షెడ్యూల్ నిర్వహించారు. ఈ సమయంలో విజయ్ ఓ బ్రిడ్జి పై నుంచి.. కిందకు ఉన్న నీళ్లలోకి దూకేశాడట. 90 అఢుగుల హైట్ ఉండడంతో.. డూప్ తో చేయిద్దామని అనుకున్నా.. తనే చేస్తానని భరోసా ఇచ్చాడట విజయ్.

మొత్తానికి దూకేసి.. నీటిలోకి వెళ్లిపోయి.. తర్వాత పైకి తేలడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుందని అంటున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ ఆధ్వర్యంలో ఈ స్టంట్ ని చిత్రీకరించారు. తెరిలో ఇలాంటి ఊపిరి బిగబట్టే యాక్షన్ సన్నివేశాలు మొత్తం 7 ఉంటాయని తెలియడంతో.. ఈ మూవీ రిలీజ్ కోసం ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.