Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో షురూ చేసిన విజయ్-వంశీ!
By: Tupaki Desk | 2 May 2022 5:30 PM GMTకోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు ..తమిళ్ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ తెలుగులో ఎంట్రీ ఇస్తుండటం విశేషం. దీంతో ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదైలంది. తొలి షెడ్యూల్ చెన్నైలో పూర్తిచేసారు.
తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం మైంది. ఈ కొత్త షెడ్యూల్ పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటుంది. నిన్న సాయంత్రమే విజయ్ హైదరాబాద్ కి చేరుకున్నాడు. అలాగే ఈ షెడ్యూల్ లో హీరోయిన్ రష్మిక మందన్న కూడా జాయిన్ అవుతుంది. తొలి షెడ్యూల్ పూర్తిగా విజయ్..ఇతర కీలక నటులపైన సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం.
ఈ షెడ్యూల్ నుంచి రష్మిక కూడా యూనిట్ తో ప్రయాణం సాగించనుంది. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం విదేశాల్లో షూట్ చేయాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయట. వాటికోసం తుదపరి విమానం ఎక్కనున్నారు. సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినా బడ్జెట్ భారీగానే ఖర్చు అవుతుందిట.
ఈ విషయంలో రాజు గారు ఎక్కడా రాజీ పడటం లేదుట. క్వాలిటీ...బెస్ట్ ఔట్ ఫుట్ అందించడమే ధ్యేయంగా ఈ త్రయం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరికల్లా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 75 రోజులు డేట్లు కేటాయించాడు. అన్ని పనులు పూర్తిచేసి సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు..తమిళ రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తారు. అందుకే సంక్రాంతి సీజన్ ని విజయ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విజయ్ నటించిన `బీస్ట్` బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేయడం విశేషం.