Begin typing your search above and press return to search.
అక్కడ కూడా వారసుడికి కష్టాలు తప్పడం లేదా?
By: Tupaki Desk | 27 Nov 2022 1:30 AM GMTతమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వారసుడు'. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి విజయ్ చేస్తున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగులో 'వారసుడు'గా తమిళంలో 'వారీసు'గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. అయితే సంక్రాంతి సమయంలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో గత కొన్ని రోజులుగా తెలుగు, తమిళ నిర్మాతల మద్య వివాదం మొదలైన విషయం తెలిసిందే.
సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహారెడ్డి' వంటి తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలకు కీలక థియేటర్లు లభించడం లేదని, మెగాస్టార్ నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' సినిమాకు ఉత్తరాంధ్రలో ప్రధాన థియేటర్లు లభించకుండా దిల్ రాజు చేస్తున్నాడని ప్రచారం మొదలైంది.
'వారసుడు' కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కీలక థియేటర్లని దిల్ రాజు ఇప్పటికే బ్లాక్ చేశాడని, పలువురు ఎగ్జిబిటర్లతో అగ్రిమెంట్ లు కూడా దిల్ రాజు చేయించుకున్నారని 'వారసుడు' సినిమాపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. దీనిపై అల్లు అరవింద్, అశ్వనీదత్ పాజిటివ్ గా స్పందించగా, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి మాత్రం ఘాటుగా స్పందించడం, 'వారసుడు' వివాదం వెనక ఎవరున్నారో తనకు తెలుసునని దిల్ రాజు తాజాగా వెల్లడించడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 'వారసుడు' వివాదం పతాక స్థాయికి చేరింది.
ఇదిలా వుంటే తమిళంలోనూ విజయ్ సినిమా హాట్ టాపిక్ గా మారినట్టుగా తెలుస్తోంది. విజయ్ 'వారీసు' సమయంలో అజిత్ నటిస్తున్న 'తునీవు' రిలీజ్ కాబోతోంది. హెచ్. వినోద్ రూపొందిస్తున్న ఈ మూవీపై తమిళనాట భారీ అంచనాలున్నాయి. అయితే ఈ మూవీని యంగ్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ భారీ స్థాయిలో తమిళ నాడు వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాడట.
దీంతో ఈ మూవీకి ప్రధానంగా భారీ స్థాయిలో థియేటర్లని బ్లాక్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో థియేటర్లని బ్లాక్ చేయడంతో విజయ్ 'వారీసు'కు థియేటర్లు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజుకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మంచి పట్టు సాధించాడు కాబట్టి ఇక్కడ థియేటర్లు బ్లాక్ చేయగలిగాడని.. అదే తరహాలో తమిళ నాడులో విజయ్ సినిమా కోసం థియేటర్లని బ్లాక్ చేయడం కష్టమని అంటున్నారు. దీంతో విజయ్ 'వారీసు'కు అక్కడ ఇబ్బందులు తప్పేలా లేవని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.