Begin typing your search above and press return to search.
విజయ్ వర్సెస్ అజిత్..ఈ పోటీ వెనకున్నస్టోరీ తెలుసా?
By: Tupaki Desk | 7 Jan 2023 2:30 PM GMTపండక్కి ఒక్క స్టార్ హీరో సినిమా వస్తోందంటేనే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా వుండదు. అదే పండక్కి ఇద్దరు స్టార్స్ పోటీపడితే ఫ్యాన్స్ ని ఆపడం ఎవరి వల్లా కాదు. ఇద్దరు హీరోల అభిమానులు థియేటర్ల వద్ద చేసే హంగామా వేరే లెవెల్ లో వుంటుంది. ఇప్పుడు ఇదే సందడి విజయ్, అజిత్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు సంక్రాంతికి ఒకే రోజు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. విజయ్ `వారీసు`తో వస్తుండగా, అజిత్ `తునీవు`తో బరిలో దిగుతున్నాడు.
విజయ్ నటించిన `వారీసు` జనవరి 11న విడుదల కాబోతోంది. రషమిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వంశ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దిల్ రాజు మార్కు కుటుంబ విలువలతో రూపొందింది. ఇక అజిత్ తో నేర్కొండపార్వై, వలిమై వంటి సినిమాలని అందించిన హెచ్ వినోద్ ముచ్చటగా మూడవ సారి కలిసి చేసిన మూవీ `తునీవు`. మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది.
బోనీ కపూర్ కు నేర్కొండపార్వై, వలిమై వంటి సినిమాల తరువాత అజిత్ తో ఇది హ్యాట్రిక్ మూవీ. ఈ సినిమా కూడా జనవరి 11నే రాబోతోంది. విజయ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తుంటే అజిత్ మాత్రం పక్కా యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. `వారీసు` పాటలతో ఆటకట్టుకుంటుంటే అజిత్ తునీవు మాత్రం స్టైలిష్ యాక్షన్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. అంతే కాకుండా ఇందులో అజిత్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ చిన్న యాటిట్యూడ్ ని చూపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. వీరిద్దరి మధ్య సంక్రాంతి సమరం 1996లోనే మొదలైంది.
ఆ ఏడాది అజిత్ నటించిన `వాన్ మతి` జనవరి 12న రిలీజ్ కాగా విజయ్ నటించిన `కోయంబత్తూర్ మపిళ్లై` జనవరి 15న విడుదలైంది. ఈ రెండు కూడా మంచి విజయాల్ని సాధించడంతో అసలు ఆట అక్కడి నుంచే మొదలైందట. ఈ ఆట విజయ్ నటించిన `జిల్లా`, అజిత్ `వీరమ్` వరకు సాగింది. ఫైనల్ గా బ్రేక్ పడింది. మళ్లీ ఎనిమిదేళ్ల విరామం తరువాత మళ్లీ ఈ ఇద్దరు సంక్రాంతి బరిలో పోటీపడుతున్నారు. దీంతో ఈ సంక్రాంతి పోటీ విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య సరవత్రంగా మారింది.
ఇప్పటికే నెట్టింట వార్ డిక్లేర్ చేసిన ఫ్యాన్స్ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తమ హీరోల సినిమాలని నెట్టింట ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. ఎనిమిదేళ్ల విరామం తరువాత సంక్రాంతికి పోటీకి దిగుతున్న ఈ ఇద్దరు హీరోల్లో విజయ్ పై చేయి సాధిస్తాడా?.. లేక అజిత్ పై చేయి సాధిస్తాడా? అన్నది తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.