Begin typing your search above and press return to search.
ఆ 'గల్లీబాయ్'... మన కుర్రాడే!
By: Tupaki Desk | 25 Feb 2019 6:22 AM GMTవిజయ్ వర్మ.... ఈ నటుణ్ణి గుర్తు పట్టారా.... అదే అండీ మన వరంగల్ శివ... ఇప్పటికైనా ఐడియా వచ్చిందా... అదే మన నాని హీరోగా తెలుగులో వచ్చిన ఎం.సీ.ఎ మూవీ లో విలన్ గా చేశాడు అతనే .... వరంగల్ శివ... ఒరిజినల్ గా విజయ్ వర్మ!... తాజాగా గల్లీ బాయ్ లో నటించి తన నటనకు ప్రశంసలు అందుకుంటున్న విజయ్ వర్మ మన హైదరాబాదీనే కావడం విశేషంగా చెప్పవచ్చు. యాక్టింగ్ అంటే పిచ్చితో పూణే వెళ్లిపోయిన విజయ్ వర్మ మెల్లగా స్టేజ్ షోస్ చేస్తూ షార్ట్ ఫిల్మ్ లో నటించి బాలీవుడ్ తెరపై మెరుస్తున్నాడు...
2012 లో "చిట్టగాంగ్" సినిమాలో నటించిన విజయ్ వర్మ ఆ తర్వాత ప్రియదర్శన్ దర్శకత్వంలో "రంగ్రీజ్"లో నటించి అలరించాడు. ఇక ఆ తర్వాత వరుసగా "గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్", "పింక్", "మాన్సూన్ షూట్ ఔట్" లాంటి వరుస హిందీ సినిమాల్లో నటించిన తర్వాత మన వాడికి తెలుగులో విలన్ పాత్ర దక్కింది. అయితే హైదరాబాదీ కావడం, అందులోనూ తెలుగు వాడు కావడంతో, ఎప్పటి నుంచో తెలుగులో ఒక సినిమా చెయ్యాలి అని అనుకుంటున్న తరుణంలో ఎం.సీ.ఏ రూపంలో అవకాశం దక్కిందట మన యువ విలన్ కి. ఇక ఈ సినిమా విషయంలో ఇంకో ఆసక్తికర విషయం ఏంటి అంటే...
తెలుగు సరిగ్గా రాని మన వాడు ఈ సినిమాలో వరంగల్ శివ గా నటించిన క్రమంలో ఆ పాత్ర చెయ్యడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట... తెలుగులో డైలాగ్స్ సరిగ్గా అర్ధం అయ్యేవి కాదట... ఒక్కో డైలాగ్ ఒకటికి పది సార్లు ప్ర్యాక్టీస్ చేసి మరీ చెప్పానని అంటున్నాడు.. ఇక తాజాగా భారీ హిట్ అందుకున్న గల్లీ బాయ్ లో సైతం మన వాడు మెరిసాడు... మోయీన్ పాత్రలో నటించి మెప్పించాడు... చిన్నప్పుడు ఆకతాయిగా ఉండేవాడిని అని, ఎప్పుడూ ఆడపిల్లల హాస్టల్స్ , కాలేజీల చుట్టూ తిరిగే వాడిని అని, అయితే నటనపై నాకున్న పిచ్చే నాకు ఇంతటి మంచి లైఫ్ ని అందించింది అంటున్నాడు ఈ యువ విలన్. మరి ఈ యువ విలన్ తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించాలి అని, బాలీవుడ్ లో మరింత ఎత్తుకు ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుందాం...