Begin typing your search above and press return to search.
కరోనా: కొడుకు గురించి స్టార్ హీరో ఆందోళన
By: Tupaki Desk | 14 April 2020 5:00 PM ISTఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకేనన్న సామెత ఉండనే ఉంది. ఇప్పుడు దక్షిణాదిలో ఎంత పెద్ద హీరో అయినా తమిళ స్టార్ హీరో విజయ్ తన కొడుకు కోసం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడట.. కారణం కరోనా.
స్టార్ హీరో విజయ్ కొడుకు ఇప్పుడు చిక్కుల్లో ఉన్నాడు. భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తో లాక్ డౌన్ విధించిన వేళ హీరో విజయ్ కుమారుడు జాన్సన్ సంజయ్ కెనడా దేశంలో చిక్కుకుపోయాడు. లాక్ డౌన్ తో మార్చి 25 నుంచి భారత్ లోకి విమాన సర్వీసులు బంద్ అయిపోయాయి. దీంతో కెనడాలో కూడా కరోనా ప్రబలుతుండడంతో స్టార్ హీరో విజయ్ తీవ్ర ఆందోళనతో కొడుకుతో ఫోన్ లో మాట్లాడుతూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నట్టు తెలిసింది.
హీరో విజయ్ కొడుకు జాన్సన్ సంజయ్ కెనడాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు అభ్యసిస్తున్నాడు. ప్రస్తుతం కెనడాలో కరోనా తీవ్రత అమెరికా అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో తన కుమారుడు జాన్సన్ ను ఇంటి నుంచి బయట అడుగుపెట్టవద్దని విజయ్ కోరుతున్నట్టు సమాచారం. కరోనా ముగిసే వరకు ఇంట్లోనే ఉండాలని సూచించాడట..
హీరో విజయ్ కు భార్య సంగీత - కుమార్తె దివ్య సాషా - కుమారుడు జాన్సన్ లు ఉన్నారు. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న తన నివాసంలో విజయ్ ఉంటున్నాడు. సంజయ్ ఇప్పటికే కొన్ని షార్ట్ ఫిలింలు తీశాడు.