Begin typing your search above and press return to search.
‘రోబో’ నిర్మాతలు.. ఎన్నాళ్లకెన్నాళ్లకో
By: Tupaki Desk | 6 Dec 2017 7:32 AM GMTసౌత్ ఇండియాలో లాంగ్ హిస్టరీ ఉన్న అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ‘సన్ పిక్చర్స్’ ఒకటి. ఆ సంస్థ గతంలో ఎన్నో భారీ సినిమాలు నిర్మించింది. చివరగా ‘రోబో’ లాంటి సెన్సేషనల్ మూవీని ప్రొడ్యూస్ చేసింది. ఆ సినిమా తీసే సమయానికి బాలీవుడ్ సినిమాల బడ్జెట్లు కూడా వంద కోట్లు దాటేవి కావు. కానీ శంకర్-రజినీల మీద.. ‘రోబో’ కథ మీద నమ్మకం పెట్టి ఏకంగా రూ.150 కోట్లతో.. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఆ సినిమా తీసి సంచలనం సృష్టించింది సన్ పిక్చర్స్. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని ‘రోబో’ ప్రొడక్షన్ వాల్యూస్ చూసి అందరూ షాకైపోయారు. ఐతే ఇలాంటి భారీ సినిమా తీసిన నిర్మాణ సంస్థ.. ఏడేళ్ల పాటు మరో సినిమానే తీయలేదు.
మారన్ కుటుంబం ఆర్థిక వివాదాల్లో చిక్కుకోవడం.. ‘సన్ పిక్చర్స్’ ప్రొడక్షన్ ఆగిపోయింది. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారాక మారన్ ఫ్యామిలీకి చాలా ఇబ్బందులు తలెత్తాయి. వాటన్నింటి నుంచి కొంతమేర బయటపడి ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటోంది ఆ ఫ్యామిలీ. ఇక మళ్లీ ప్రొడక్షన్ మొదలుపెట్టాలని చూస్తున్న ‘సన్ పిక్చర్స్’ రీఎంట్రీలో ఓ భారీ ప్రాజెక్టునే టేకప్ చేస్తున్నట్లు సమాచారం. విజయ్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కబోయే భారీ సినిమాను ఈ సంస్థే ప్రొడ్యూస్ చేయనుందట. విజయ్-మురుగ కలయికలో ‘తుపాకి’.. ‘కత్తి’ లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. వీళ్లిద్దరూ కలిసి చేయబోయే కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీన్ని భారీ బడ్జెట్లో సన్ పిక్చర్స్ తెరకెక్కించనుందట.