Begin typing your search above and press return to search.

ఆత్మహత్య యత్నంను ట్రోల్స్‌ చేసిన నువ్వు మనిషివేనా?

By:  Tupaki Desk   |   28 July 2020 4:30 PM GMT
ఆత్మహత్య యత్నంను ట్రోల్స్‌ చేసిన నువ్వు మనిషివేనా?
X
తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్య యత్నం విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. సీమన్‌ మరియు హరి అనే వ్యక్తులు తనను సోషల్‌ మీడియా ద్వారా చాలా ఇబ్బందులు పెడుతున్నారని వారి ఫాలోవర్స్‌ నన్ను పదే పదే సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తూ నా మానసిక స్థితిని దెబ్బ తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వారి కారణంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ బీపీ ట్యాబ్లెట్స్‌ ను లైవ్‌ లోనే విజయలక్ష్మి వేసుకున్న విషయం తెల్సిందే. విజయలక్ష్మి ఆత్మహత్య యత్నం విషయాన్ని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

తన ఆత్మహత్య యత్నం విషయాన్ని సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్న వారికి సమాధానం చెప్పేందుకు గాను ఆసుపత్రి బెడ్‌ నుండే ఒక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. నా ఆత్మహత్య యత్నంను కూడా సీమన్‌ ట్రోల్స్‌ చేస్తున్నాడు. సీమన్‌ ప్రవర్తనతో విసిగి పోయాను. ఆయన మనిషేనా లేదా పశువువా. నేను ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా మారి ఇలా చేస్తున్నాను అంటూ ఆయన ప్రచారం చేయడం నాకు మరింత బాధగా ఉంది. నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.

నా వ్యక్తిగత జీవితంను సీమన్‌ మరియు హరిలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రాణాపాయం ఏమీ లేదని అయితే తన బీపీ చాలా డౌన్‌ అయ్యిందని అలాగే తన హార్ట్‌రేట్‌ తక్కువగా ఉందని కోలుకునేందుకు మరికొన్ని రోజులు పడుతుందని వైధ్యులు అన్నారని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది. సీమన్‌ విజయలక్ష్మిల మద్య అసలు వివాదం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రాలేదు.