Begin typing your search above and press return to search.
నిరాహార దీక్షలోనూ కృష్ణతోనే విజయ నిర్మల
By: Tupaki Desk | 27 Jun 2019 2:23 PM GMTకృష్ణ విజయ నిర్మల అనుబంధం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా ఇద్దరు కలిసే ఏ కార్యక్రమంకు అయినా వెళ్లే వారు. ఇద్దరు కలిసి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరి వరకు ఎంతో అన్యోన్యంగా జీవితంను సాగించిన ఈ జంటలో ఇప్పుడు కృష్ణ ఒంటరి అయ్యారు. విజయ నిర్మల మరణంతో కృష్ణ కన్నీరు పెట్టుకున్న దృష్యాలు మనం టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ప్రతి పనిలో కూడా కలిసి సాగిన ఈ జంట అప్పట్లో ప్రత్యేక ఆంధ్రా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు.
అప్పట్లో ప్రత్యేకాంధ్ర అంటూ ఆంధ్రా మరియు రాయలసీమ ప్రజలు రోడ్డు ఎక్కి ఆందోళనలు నిర్వహించారు. ఎంతో మంది ప్రాణత్యాగం కూడా చేశారు. అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ తమిళనాడు రాజధాని చెన్నైలో ఉంది. ప్రత్యేకాంధ్ర ఉద్యమంను చెన్నైలో ఉండే గట్టిగా కృష్ణ దంపతులు సమర్ధించారు. ఆ సమయంలోనే చెన్నైలోని పనగల్ పార్క్ లో కృష్ణ మరియు విజయ నిర్మలలు నిరాహార దీక్ష చేశారు.
ఆంధ్రుల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం తీర్చాలంటూ అప్పటి తమిళనాడు గవర్నర్ కు విజ్ఞప్తి పత్రం కూడా అందించడం జరిగింది. సినిమా కెరీర్ లోనే కాకుండా రాజకీయంగా కూడా కృష్ణ వెనుకుండి విజయ నిర్మల గారు ఆయన్ను నడిపించారు. వీరిద్దరి కలయికలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో ఎక్కువ శాతం సక్సెస్ లు సూపర్ హిట్ లు అయినవే ఉన్నాయి. ఒకరంటే ఒకరు ప్రాణంగా బతికిన ఈ జంటలో విజయ నిర్మల గారు మృతి చెందడం కృష్ణ గారికి ఎవరు తీర్చలేని లోటు.