Begin typing your search above and press return to search.

అమ్మాయిల విషయంలో కృష్ణ లాగే మహేష్

By:  Tupaki Desk   |   5 Aug 2018 7:47 AM GMT
అమ్మాయిల విషయంలో కృష్ణ లాగే మహేష్
X
మహేష్ బాబులో ఆయన తండ్రి పోలికలు చాలా కనిపిస్తాయి. ఐతే శారీరకంగానే కాక మనస్తత్వం విషయంలోనూ మహేష్.. కృష్ణకు చాలా దగ్గరగా ఉంటాడని అంటున్నారు విజయ నిర్మల. కృష్ణ రెండో భార్య అయిన విజయ నిర్మల మొదటి భార్య కొడుకైన మహేష్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు. కృష్ణకు.. మహేష్‌ కు అమ్మాయిల విషయంలో ఉన్న ఆసక్తికర పోలికల గురించి ఆమె వివరంచారు.

కృష్ణకు అమ్మాయిలంటే చాలా భయమట. వాళ్లతో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతాడట. హీరోయిన్లతో.. వేరే అమ్మాయిలతో మాట్లాడేటపుడు కృష్ణ తల వంచుకునే ఉంటారని.. వాళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడటానికి భయపడతారని విజయ నిర్మల చెప్పారు. ఇదే లక్షణాన్ని తాను మహేష్‌ లో కూడా గమనించినట్లు ఆమె చెప్పారు. అమ్మాయిల కళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడి వాళ్లను ఇబ్బంది పెట్టకూడదని మహేష్ అనుకుంటాడని ఆమె చెప్పారు.

ఇంకా చాలా విషయాల్లో కృష్ణతో మహేష్ కు పోలికలు ఉన్నాయన్న విజయ నిర్మల ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ ను చూస్తే తనకు కృష్ణే గుర్తుకొచ్చాడని చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసేటపుడు మహేష్ వాయిస్ కృష్ణ లాగే ఉందన్నారు. అలాగే ఈ చిత్రంలో ఒక పాటలో మహేష్ మీసం పెట్టుకుంటే కృష్ణను చూసినట్లే ఉందన్నారు. ఇక మహేష్ ఒక వ్యక్తిగా చాలా మంచి వాడని.. అలాంటి బిడ్డను ఎవరైనా ఇష్టపడతారని విజయ నిర్మల చెప్పారు.