Begin typing your search above and press return to search.
`గురువారం` మరణం ముందే తెలుసు!
By: Tupaki Desk | 27 Jun 2019 6:35 AM GMTముందే తెలిసిపోతే సిక్స్త్ సెన్స్ ఉందని అంటారు! యాథృచ్ఛికమో.. యథాలాపమో.. కొందరు మరణాన్ని ముందే కనిపెట్టేస్తారని అంటారు. ఇదేమీ `ఫైనల్ డెస్టినేషన్` థీమ్ కాదు కానీ.. తన మరణం `గురువారం` అని లెజెండరీ దర్శకనిర్మాత విజయనిర్మల ముందే కనిపెట్టారని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు అనడం చర్చనీయాంశమైంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు.. తొందర్లోనే నయం అయిపోతుందని వారించబోయిన డాక్టర్లతో విజయనిర్మల సర్ ప్రైజ్ నిచ్చే ఓ మాటన్నారు.
``పోవడం .. ఉండడం మన చేతిలో లేదు. నేను ఎప్పుడు పోయినా ఆరోజు గురువారం అవుతుంది`` అని అన్నారట. అంటే గురువారం సామి వారు సాయిబాబాపై ఉన్న ప్రేమ- భక్తి భావంతో అమ్మ విజయనిర్మల అలా అన్నారని భావించాలి. మొత్తానికి బాబా భక్తురాలిగా ఆయన ఆశీస్సులు అందుకునే గురువారం వేకువ ఝామున స్వర్గస్తులయ్యారు. సిక్స్త్ సెన్స్.. విల్ పవర్ ఏదైనా అనండి.. మొత్తానికి తన మరణం ఫలానా రోజు ఉంటుందని మాత్రం ముందే తెలుసుకున్నారు విజయనిర్మల. ఇలాంటి వరం ఎందరికో కానీ దక్కదు. ఆమె మరణానంతరం సూపర్ స్టార్ కృష్ణ ఎంతో దిగాలు పడిపోయారని తెలుస్తోంది. ఆమె లేరు అన్నది జీర్ణించుకోలేని కృష్ణ తలను టేబుల్ కి కొట్టుకున్నంత పని చేశారట. ఆయన శోకాన్ని ఆపలేకపోతున్నారని తెలుస్తోంది.
ఈ మరణం నేపథ్యంలో మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. విజయనిర్మలకు అత్యంత ఇష్టుడు ఎవరు? అంటే మనవడు నవీన్ కృష్ణ గురించే చెబుతున్నారంతా. నవీన్ ప్రస్తుతం హీరోగా కెరీర్ కోసం శ్రమిస్తున్నారు. అతడి ఉన్నతిని విజయనిర్మల కోరుకున్నారు. పెద్ద హీరోగా తనని చూడాలని అనుకున్నారట. తన ఆస్తిలో మెజారిటీ వాటాను నవీన్ కే రాసిచ్చేశారని.. కొడుకు కంటే ఎక్కువ వాటా నవీన్ కే దక్కిందని తెలుస్తోంది. ఇక దీపం ఉండగానే చక్కదిద్దుకునే అలవాటు తనకు ఉంది. అందుకే ఎంతో తెలివిగా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఎకరాల్లో ఉన్న తోటను కొనిపించారట. ప్రస్తుతం అక్కడే విజయనిర్మల పార్థీవ దేహాన్ని ఉంచారు. ఈ శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని సీనియర్ నరేష్ ప్రకటించారు.