Begin typing your search above and press return to search.

విజయశాంతికి ఏమైంది?

By:  Tupaki Desk   |   10 May 2017 4:58 AM GMT
విజయశాంతికి ఏమైంది?
X
లేడీ అమితాబ్ గా పిలిపించుకున్న మాజీ హీరోయిన్ విజయశాంతి. తాజాగా ఈమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఓ ఏడాది క్రితం ఈమె రీఎంట్రీ గురించిన వార్తలు వచ్చాయి తప్ప.. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ రాలేదు. గతంలో మాదిరిగానే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేస్తారనే టాక్ వినిపించింది.

అయితే.. ఆ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో ఈమె కాలికి ఫ్రాక్చర్ అయిందట. లిగ్మెంట్ కదలడంతో సుదీర్ఘకాలం పాటు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అంతే కాదు.. పాదానికి కూడా కొన్ని ఆపరేషన్స్ చేశారని తెలుస్తోంది. హెవీ వర్కవుట్స్ చేయడం కారణంగానే ఇలా జరిగిందని.. ఇకపై పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించిన డాక్టర్స్ విజయశాంతిని డిశ్చార్జ్ చేశారని తెలుస్తోంది. కొంతకాలం పాటు బెడ్ రెస్ట్ కూడా అవసరమని చెప్పారట. అయితే.. కొన్ని వారాలు మాత్రమే రెస్ట్ తీసుకున్న విజయశాంతి.. తిరిగి వర్కవుట్స్ మొదలుపెట్టేశారని సన్నిహితులు అంటున్నారు.

ప్రస్తుతం రోజుకు రెండున్నర గంటలపాటు జిమ్ లో గడుపుతూ వర్కవుట్స్ చేస్తున్నారు లేడీ అమితాబ్. అయితే.. పాదంపై మాత్రం భారం పడకుండా జాగ్రత్తపడుతూ హెవీ వర్కవుట్స్ నే చేస్తున్నట్లు టాక్. మరికొన్ని నెలల్లోనే కొత్త సినిమా ప్రారంభానికి ఆమె విజయశాంతి సిద్ధమవుతున్నారని.. ఒకట్రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభించవచ్చని టాలీవుడ్ టాక్