Begin typing your search above and press return to search.

5 కోట్ల అప్పు.. ప్రముఖ హీరో ఆస్తుల వేలం

By:  Tupaki Desk   |   21 Jun 2019 2:30 PM GMT
5 కోట్ల అప్పు.. ప్రముఖ హీరో ఆస్తుల వేలం
X
కెప్టెన్ ప్రభాకరన్.. ఈ పేరుతో 90వ దశకంలో తెలుగునాట పాపులర్ అయిన హీరో. ఆయనే విజయ్ కాంత్.. తమిళంలో అగ్రహీరోగా వెలుగొంది తెలుగు నాట కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడీయన.. ‘కెప్టెన్ ప్రభాకరన్’ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది.

అయితే హీరోగా వెలుగు వెలిగిన విజయ్ కాంత్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి చేతులు కాల్చుకున్నాడు. ‘డీఎండీకే’ రాజకీయ పార్టీని స్థాపించి ఘోర ఓటములను చవిచూశాడు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయ్ కాంత్ కు చెందిన డీఎండీకే పార్టీ తరుఫున నిలబడ్డ పలువురు అభ్యర్థులు ఘోర పరాజయం పొందారు. ఇక కొన్ని నెలలుగా విజయ్ కాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలా ఆరోగ్యం సహకరించక పార్టీ ఫ్లాప్ అయ్యి అష్టకష్టాల్లో ఉన్న విజయ్ కాంత్ పై మరో పిడుగు పడింది.

తాజాగా విజయ్ కాంత్ 5 కోట్ల అప్పు చెల్లించకపోవడంతో ఆయన తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఓ జాతీయ బ్యాంక్ అన్ని పేపర్లలో ప్రకటన ఇవ్వడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. ‘అండాల్ ఆళగర్ ఎడ్యూకేషన్ ట్రస్ట్’ పేరుతో విజయకాంత్ ఓ చారిటీసంస్థను నడుపుతున్నాడు. దీనిమీద రూ.5 కోట్ల అప్పుతీసుకొని కట్టలేదు.దీంతో ఈ ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకు సిద్ధమైంది. విజయ్ కాంత్ పరిస్థితి తెలిసి కొందరు అభిమానులు దాన్ని వేలంలో కొని ఆయనకు ఇవ్వడానికి రెడీ అయ్యారు.

ఇలా సినీ తారలు రాజకీయాల్లోకి వెళ్లి ఇటీవల ఫెయిల్ అవుతున్న వారు ఎక్కువవుతున్నారు. చిరంజీవి, కమల్ హాసన్, విజయ కాంత్ బాటలోనే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో విఫలమవ్వడం విశేషం.