Begin typing your search above and press return to search.

క్వీన్ ఎలిజిబెత్ తో ఎన్టీఆర్.. విజయనగర రాజులు.. ఎప్పుడు కలిశారు? చరిత్ర ఏంటి?

By:  Tupaki Desk   |   10 Sep 2022 7:38 AM GMT
క్వీన్ ఎలిజిబెత్ తో ఎన్టీఆర్.. విజయనగర రాజులు.. ఎప్పుడు కలిశారు? చరిత్ర ఏంటి?
X
బ్రిటీష్ మహారాణికి తెలుగు ప్రజలు ఆతిథ్యం ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రంలో ఆమె మూడు రోజులు ఉండి ఇక్కడ అంతా కలియతిరగడం విశేషం. 40 ఏళ్ల కిందట ఆమె హైదరాబాద్ వచ్చారు. తెలుగు ప్రజల ఆత్మీయానికి ఆమె ఫిదా అయ్యారు. బ్రిటీష్ మహారాణి క్వీన్ ఎలిజిబెత్ 2 మరణంతో అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆమె గురించి ప్రతి ఒక్కరూ తలుచుకుంటున్నారు. తన జీవిత కాలంలో బ్రిటీష్ రాణి ఎన్నో దేశాల్లో పర్యటించారు. అతి సామాన్యురాలిగా జీవించడానికే ప్రయత్నించారు. ఆమె గురించిన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్రిటీష్ రాణి తన జీవితకాలంలో మూడు సార్లు భారత్ సందర్శించారు. 1983లో వచ్చినప్పుడు ఆమె హైదరాబాద్ కు వచ్చారు. ఆ ఏడాది నవంబర్ 20న నగరానికి వచ్చిన మహారాణి దంపతులకు అప్పటి రాష్ట్ర గవర్నర్ రాంలాల్, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల హైదరాబాద్ పర్యటనలో ఇక్రిశాట్, కుతుబ్ షాహి సమాధులు, బీహెచ్.ఈఎల్ ను ఎలిజిబెత్ సందర్శించారు. ఆ రేర్ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

1983లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ సదస్సు ప్రారంభోత్సవానికి రాణి రెండో ఎలిజిబెత్ భారతదేశానికి వచ్చారు. పది రోజుల పాటు దేశవ్యాప్తంగా పర్యటించారు. భాగ్యనగరంలో మూడు రోజుల పాటు విడిది చేశారు.

మేడ్చల్ సమీపంలోని దేవరయాంజల్ లో ఓ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాణి దంపతులు అక్కడ ఉన్న సీతారాముల ఆలయంలొ పూజలు చేశారు. రాణి పర్యటనను కవర్ చేసేందుకు 30కు పైగా మీడియా సంస్థల ప్రతినిధులు ఆమె వెంట వచ్చారు. వారికి ప్రత్యేకంగా ఒక మీడియా పాయింట్ ను సైతం ఏర్పాటుచేశారు.

విజయనగరం పూసపాటి రాజవంశీయులతో రాణి ఎలిజిబెత్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. 1961లో రాణి బెనారస్ లోని విజయనగరం భవన్ ను సందర్శించారు.ఆమెకు పూసపాటి రాజవంశీయులు పూసపాటి విజయరామ గజపతిరాజు స్వాగతం పలికారు. విజయనగరం సంస్థానం, పరిపాలన గురించి సమగ్రంగా వివరించారు. నాటి రాజుల ఔన్నత్యాన్ని వారికి విడమరచి చెప్పారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.