Begin typing your search above and press return to search.
చిరు - నాగ్ లపై పరోక్షంగా విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 3 Aug 2022 9:30 AM GMTబాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమా ఆగస్టు 11న దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో అక్కినేని నాగచైతన్య హిందీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని బహిష్కరించాలని సోషల్ మీడియాలో #BoycottLalSinghChaddha ట్యాగ్ తో కొందరు ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో అమీర్ ఖాన్ చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగానే 'లాల్ సింగ్ చద్దా' చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని ఓ వర్గం నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి కూడా వారితో గొంతు కలిపింది. ఈ చిత్రాన్ని బహిష్కరించాలంటూ ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేసింది. అమీర్ ఖాన్ ను తీవ్రంగా విమర్శించిన విజయశాంతి.. తన ట్వీట్స్ తో పరోక్షంగా చిరంజీవి - అక్కినేని నాగార్జున లను కూడా టార్గెట్ చేసింది.
విజయశాంతి ట్వీట్ చేస్తూ.. ''ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే... ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నరు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు'' అని పేర్కొన్నారు.
''భారత్ లో అసహనం పెరిగిపోయిందని.. ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆమీర్ అన్నారు. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో.. ఇప్పటికీ పొందుతున్నారో.. చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుంది''
''మనకి స్వాతంత్ర్యం రావడానికి ముందు, తర్వాత, నేడు... ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ ఆమీర్ తో సహా బాలీవుడ్ లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు. కానీ వాస్తవమేంటో తెలిసిన ప్రజలు ఆమీర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారు''
''గతంలో ఆమీర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారు. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాని నిషేధించాలని కూడా డిమాండ్ చేశాయి. ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' అనే ఇన్స్పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారు. కానీ, ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో ఆమీర్ లేరు''
''గతంలో అమీర్ చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్ తో ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నరు. దురదృష్టమేంటంటే.. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు.. ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు ఆమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీ షోల్లో పాల్గొంటున్నరు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి'' అని విజయశాంతి వరుస ట్వీట్స్ చేసింది.
'లాల్ సింగ్ చడ్డా' సినిమాని చిరంజీవి - నాగార్జున కలిసి తెలుగులో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ - నాగచైతన్య లతో ఇటీవల ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు విజయశాంతి ట్వీట్స్ లో వారి పేర్లను ప్రస్తావించనప్పటికీ.. అవి పరోక్షంగా వాళ్ళను ఉద్దేశించి అన్నదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఎస్ఎస్ రాజమౌళి - సుకుమార్ వంటి దర్శకులు కూడా సినిమా చూసి అమీర్ ను అభినందించారు. మరి ఇప్పుడు సీనియర్ నటి కమ్ బీజేపీ నాయకురాలి ట్వీట్స్ పై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.