Begin typing your search above and press return to search.
సరిలేరు నీకెవ్వరు.. ఇదీ లేడీ బాస్ ట్విస్టు
By: Tupaki Desk | 23 Jun 2019 7:12 AM GMTసీనియర్ నటి విజయశాంతి రీఎంట్రీ ఇటీవల హాట్ టాపిక్. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాతో రీఎంట్రీ పెద్ద మలుపు అనే చెప్పాలి. లేడీ అమితాబ్ పునఃప్రవేశం ఎలా ఉండబోతోంది? అన్న ఆసక్తి అభిమానుల్ని నిలవనీయడం లేదు. ఆ క్రమంలోనే ఎవరికి వారు విజయశాంతి పాత్ర ఫలానా విధంగా ఉంటుంది! అంటూ ఊహాగానాలు సాగించడం తెలిసిందే. అత్త పాత్ర అని కొందరు.. లేదు విలన్ గా నెగెటివ్ షేడ్ మాత్రమేనని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు.
అయితే తాజా ఇంటర్వ్యూలో లేడీ బాస్ అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టేశారు. అసలు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ తో మీ పాత్రకు రిలేషన్ ఏంటి? అని విజయశాంతినే ప్రశ్నిస్తే .. ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. అయితే ఆ రెండు పాత్రలు ఒకదానితో ఒకటి పోటాపోటీగా ఉంటాయని సమాంతరంగా సాగుతాయని తెలిపారు. నెగటివ్ షేడ్స్ ఉంటాయా? అన్న ప్రశ్నకు.. నెగెటివిటీకి నో ఛాన్స్ అని అన్నారు. అందరికీ నచ్చే పాజిటివిటీ ఉన్న పాత్రలో నటించాను. బయట కూడా అలా ఉండడమే ఇష్టమని అన్నారు. విజయశాంతి నెగటివ్ షేడ్సా? నో ఛాన్స్ అని అనడం ఆసక్తికరం. నేను పాజిటివ్ పర్సన్. చేసే పాత్రలూ అలానే ఉండాలని కోరుకుంటాను. సరిలేరు చిత్రంలో.. నాది చాలా పాజిటివ్ పాత్ర. అందరికీ నచ్చుతుందని వెల్లడించారు. విజయశాంతి నెగటివ్ షేడ్సా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు? నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు వస్తే చేయరా? అని ప్రశ్నిస్తే.. నెగటివ్ ఎందుకు.. పాజిటివ్ గా ఉంటేనే మంచిది కదా అని అన్నారు.
`సరి లేరు నీకెవ్వరు` ఒప్పుకోవడానికి కారకులెవరు? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఏ నిర్ణయమైనా సొంతంగా తీసుకుంటానని.. ఎవరూ ఒప్పించరని అన్నారు. ఎన్నికలు అయ్యాక గ్యాప్ దొరికింది. సినిమాలు చేయాలని ఎప్పటినుంచో దర్శకులు పోరుతున్నారు. నేనే ఆసక్తిని కనబరచలేదు. ఎప్పటినుంచో అడుగుతున్న వారిలో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నారు. ఒక్కసారి కథ వినండి అన్నారు. వినగానే నచ్చింది. విన్న వాటిలో బెటర్ గా ఉంది. పునఃప్రవేశానికి బావుంటుందనిపించి ఓకే చేశాను.. అని తెలిపారు. అన్నీ రాములమ్మలు.. అన్నీ కర్తవ్యాలు అంటే కుదరవు కదా! అని అన్నారు. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి ఈ సంగతుల్ని రివీల్ చేశారు.