Begin typing your search above and press return to search.

మహర్షితో రాములమ్మ - ఈజిట్ పాజిబుల్

By:  Tupaki Desk   |   10 March 2019 12:17 PM IST
మహర్షితో రాములమ్మ - ఈజిట్ పాజిబుల్
X
మహర్షి ఇంకా విడుదల కాకముందే అనిల్ రావిపూడి ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయకుండానే మహేష్ 26కి సంబంధించిన హాట్ న్యూస్ వైరల్ అయిపోతున్నాయి,. దిల్ రాజు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ మూవీకి వచ్చే సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. అసలు షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారో క్లారిటీ లేదు. మరో లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే ఇందులో లేడీ అమితాబ్ విజయ శాంతిని ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారట.

ఆవిడ ఎస్ అందో నో అందో తెలియదు కాని పాజిటివ్ గా విన్నారనే మాటైతే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఎంతవరకు ఇందులో నిజం ఉందనేది వేచి చూస్తే కాని తెలియదు. విజయశాంతి గారు హీరొయిన్ గా రిటైర్ అయ్యాక సపోర్టింగ్ రోల్స్ చేయనని తెగేసి చెప్పి రాజకీయాల వైపు వెళ్ళిపోయారు. సినిమాలలో స్టార్ అయిన విజయశాంతి అక్కడ మాత్రం ఫెయిల్ అయ్యారు. అందుకే ఇప్పుడు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఈ వార్తకు బలం చేకూర్చేలా టాక్ నడుస్తోంది.

నిజానికి విజయశాంతి నటించాలి అనుకుంటే ఏనాడో ఆ పని చేసేవారు. ఇప్పటికే బోలెడు ఆఫర్లు క్యు కట్టి ఉండేవి. కాని ఆసక్తి చూపలేదు. 30 ఏళ్ళ క్రితం విజయశాంతి మహేష్ బాబుకి కొడుకు దిద్దిన కాపురంలో తల్లిగా నటించారు. ఆ తర్వాత కూడా స్టార్ గా అందరు అగ్ర హీరోలతో గ్లామరస్ పాత్రల్లో నటించారు. బహుశా అంత వెలుగు వెలిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారని హీరొయిన్ ఒక్క విజయశాంతి మాత్రమే. మరి మహేష్ కోసం రాజీ పడతారా