Begin typing your search above and press return to search.
రానాకు నో చెప్పి మహేష్ కు ఎస్ అంటారా?
By: Tupaki Desk | 19 April 2019 4:12 AM GMTలేడీ అమితాబ్ గా పేరున్న మాజీ హీరోయిన్ విజయశాంతి టాలీవుడ్ రీ ఎంట్రీ గురించి ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. ఆవిడ సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి చాలా కాలమైంది. అక్కడ అనుకున్న ఫలితం దక్కకపోవడంతో తిరిగి ఇలా అవకాశాల వైపు ఓ కన్నేస్తున్నారన్న టాక్ మహా జోరుగా ఉంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి రానా జంటగా రూపొందబోయే పొలిటికల్ థ్రిల్లర్ లో విజయశాంతికో కీలక రోల్ ఆఫర్ చేస్తే ఆవిడ రిజెక్ట్ చేసిందని అందుకే ఆ స్థానంలో టబును తీసుకోబోతున్నారని రెండు రోజుల క్రితమే ప్రచారమయ్యింది.
అది ఇంకా మర్చిపోకుండానే అనిల్ రావిపూడి-మహేష్ బాబు కాంబోలో రూపొందబోయే మూవీలో విజయశాంతి ఆల్మోస్ట్ ఓకే అయినట్టేనని మరోసారి గుప్పుమంది. చాలా కీలకమైన పాత్ర కాబట్టి ఒప్పుకున్నారని ఇది నిజమైతే మాత్రం ఆవిడ ఫ్యాన్స్ కు అంత కన్నా గుడ్ న్యూస్ ఏముంటుందని టాక్ మొదలైంది. అయితే స్వయానా నిర్మాణ సంస్థనో లేదా హీరో దర్శకుడు ఎవరో ఒకరు చెబితే కానీ ఇది నిర్ధారించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి పాత్రలు విజయశాంతికి రావడం కొత్త కాదు వింత కాదు.
నేను సినిమాలు చేయనని ప్రకటించేసి హీరోయిన్ గానే రిటైర్ అయిపోయి నిర్మాణం జోలికి కూడా వెళ్లకుండా కేవలం పాలిటిక్స్ మీద మాత్రమే దృష్టి పెట్టారు. ఇప్పుడిలా సపోర్టింగ్ రోల్స్ కి ఓకే చెప్తారా అంటే అనుమానమే. పైగా చాలా కాలం నుంచి విజయశాంతి మీడియాకు అందుబాటులో లేరు. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు. అలాంటప్పుడు ఎంత మహేష్ బాబు సినిమా అయినా ఎస్ చెప్తారని కాదు. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయశాంతితో కలిసి నటించిన ఆఖరి చిత్రం కొడుకు దిద్దిన కాపురం. ఇది వచ్చి 30 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడీ టాక్ నిజమైతే అరుదైన కాంబోకు రంగం సిద్ధమైనట్టే