Begin typing your search above and press return to search.

విజయశాంతి పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఇదే

By:  Tupaki Desk   |   19 Dec 2020 12:30 AM GMT
విజయశాంతి పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఇదే
X
1980, 90ల్లో తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లింది. అక్కడ కూడా లేడీ సూపర్‌ స్టార్‌ గా పేరు దక్కించుకున్నారు. రాజకీయాల్లో ఒడి దొడుకులు తప్పవు. రాములమ్మ విజయశాంతి కూడా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఇటీవల బీజేపీలో చేరి కొత్త పొలిటికల్‌ జర్నీని ప్రారంభించిన విజయశాంతి ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సినిమా రాజకీయ వ్యక్తిగత జీవితం గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లోకి మళ్లీ వచ్చే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా సమయంలో మళ్లీ సినిమాలు చేయాలని అనిపించినా కూడా రాజకీయాలతో బిజీగా ఉంటున్న కారణంగా సినిమాలు చేయలేను అంది. ఇక పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో విజయశాంతి స్పందిస్తూ.. పిల్లలు ఉంటే వారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉంటుంది. పిల్లలు ఉంటే ఏదో ఒక సమయంలో స్వార్థంతో ఆలోచిస్తాం.

కుటుంబం అంటేనే స్వార్థం పుట్టుకు వస్తుంది. నన్ను ఈ స్థాయికి చేర్చిన ప్రజలే నా కుటుంబంగా భావించి పిల్లలు వద్దనుకున్నాను. ప్రజల కోసం నేను సేవ చేయాలనుకున్నాను. నా జీవితం మొత్తం ప్రజా సేవకే. నేను చనిపోయే లోపు నా ఆస్తులన్నింటిని కూడా ప్రజాసేవ కోసం వినియోగిస్తాను అంటూ ఈ సందర్బంగా విజయశాంతి పేర్కొన్నారు.