Begin typing your search above and press return to search.
బెజవాడ అడ్డాలో పైరసీ సీడీలు
By: Tupaki Desk | 31 Dec 2015 6:35 AM GMTఏదైనా సినిమా ఇలా రిలీజ్ కి రావడమే ఆలస్యం. వెంటనే థియేటర్ కాపీని కాపీ చేసేసి డీవీడీల్లోకి ఎక్కించేసి మార్కెట్లోకి తెచ్చేసే గ్యాంగ్ లు మనకు ఉన్నాయి. టాలీవుడ్ ని పైరసీ మహమ్మారీలా వేదిస్తోంది. ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ దాడులు జరుగుతున్న పైరసీ చేసేవాళ్లను పట్టుకుంటున్నా ఏం ఉపయోగం లేదు. మా సినిమాని పైరసీ చేయొద్దు మొర్రో అని దర్శకనిర్మాతలు మొరపెట్టుకున్నా ఈ పైరేట్ లు ఎవరి మొరా వినడం లేదు. తమ వృత్తి అదే. స్పార్టన్ల విధి చంపడం మాత్రమే అన్నట్టు.. మా పని పైరసీ చేయడం మాత్రమే అని తమ పని తాము చేసుకుపోతున్నారు.
అయితే వీళ్ల వెంట పడే పోలీసులు కూడా అంతే చాకచక్యంగా పైరసీ దారుల్ని పట్టుకుని తీరుతున్నారు. ఇటీవలే నవ్యాంధ్ర క్యాపిటల్ పరిసరం అయిన విజయవాడలో ఓ భారీ గ్యాంగ్ దొరికింది. కొత్త పేట డ్రెయిన్ స్ర్టీట్ లో ఈ గ్యాంగ్ పట్టుబడింది. వీరి వద్ద 5000 పైగా డీవీడీలు దొరికాయి. సౌఖ్యం - జతకలిసే - శంకరాభరణం - బెంగాల్ టైగర్ లాంటి కొత్త సినిమాలు ఈ సీడీల్లో అందుబాటులో ఉన్నాయ్. వీటితో పాటు ఇటీవలి కాలంలో రిలీజైన ప్రతి సినిమా డీవీడీ వీళ్ల దగ్గర అందుబాటులో ఉన్నాయ్.
గతంలోనూ ఇలా పైరసీ సీడీల్ని భారీ మొత్తంలో పట్టుకుని ధ్వంశం చేసిన సందర్భాలున్నాయ్. దొంగల్ని పట్టుకుని జైళ్లలో వేసినా తిరిగి బైటికి వచ్చాక మరింత పకడ్భందీగా ఈ పనులు చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం అయిన విజయవాడలో ఇలాంటి అరాచకాలు దారుణాలు అసాధారణంగా పెట్రేగిపోతున్నాయన్నది క్రైమ్ డిపార్ట్ మెంట్ నుంచి తాజా రిపోర్ట్ అందుతోంది. మునుముందు ఇంకెలాంటి పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయో మరి!