Begin typing your search above and press return to search.
వర్మను తక్షణమే అరెస్ట్ చేయాలన్న బెజవాడ కోర్టు
By: Tupaki Desk | 20 Sep 2017 5:00 AM GMTఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతానని చెప్పుకునే ప్రఖ్యాత దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇప్పటివరకూ కోర్టు నుంచి తీవ్రస్థాయితో కూడిన ఆదేశాలు రాలేదనే చెప్పాలి. ఓపెన్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరించే రాంగోపాల్ వర్మ తన మార్క్‌కు తగ్గట్లే.. ఎవరితోనైనా.. ఎక్కడైనా సరే తన ధోరణిలోనే తాను అన్నట్లుగా బిహేవ్ చేసేవారు.
ఈ కారణంతోనే పలువురితో చక్కటి సంబంధాలు పోగొట్టుకున్నారన్న పేరు వర్మకుంది. ఇదిలా ఉంటే.. ఒక సినిమాకు సంబంధించి వర్మను అరెస్ట్ చేయాలన్న తీవ్రమైన ఆదేశం ఇప్పటివరకూ రాలేదని చెప్పాలి. ఆ మధ్యన తీసిన వంగవీటి మూవీకి సంబంధించి తాజాగా విజయవాడ కోర్టు ఊహించనిరీతిలో రియాక్ట్ అయ్యింది.
తమ అభ్యంతరాల్ని పట్టించుకోకుండా వంగవీటి రంగా జీవితగాథను వంగవీటి అనే మూవీ తీసి తమ కుటుంబాన్ని అవమానించారంటూ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించారు. కొద్ది నెలలుగా ఈ కేసుకు సంబంధించిన విచారణ సాగుతోంది. ఇదిలా ఉంటే.. దర్శకుడు రాంగోపాల్ వర్మకు.. ఆ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లను తక్షణమే ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వివాదాలతో కలిసి నడిచేస్తారన్న పేరున్న రాంగోపాల్ వర్మకు తాజా పరిణామం సరికొత్త అనుభవంగా పలువురు అభివర్ణిస్తున్నారు. విజయవాడ కోర్టు ఆదేశాల నేపథ్యంలో బెజవాడ పోలీసులు.. రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సి ఉంది. మరి వారెలా రియాక్ట్ అవుతారో.. విజయవాడ కోర్టు ఆదేశాలపై వర్మ ఎలా స్పందిస్తారు? అన్నది ఇప్పుడు ఉత్కంట రేపుతోంది.