Begin typing your search above and press return to search.

ముంబై టూ హైద‌రాబాద్ దేవ‌ర‌కొండ‌ ప‌రుగు!

By:  Tupaki Desk   |   18 April 2022 8:39 AM GMT
ముంబై టూ హైద‌రాబాద్ దేవ‌ర‌కొండ‌ ప‌రుగు!
X
యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. `లైగ‌ర్` షూటింగ్ పూర్తికాగానే కొంత విరామం అనంత‌రం బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాల్ని ప్రారంభించారు. ఇటీవ‌లే డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ `జ‌న‌గ‌ణ‌మ‌ని` ముంబైలో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య సినిమా ప్రారంభ‌మైంది. `లైగ‌ర్` రిలీజ్ కాకుండానే కాన్ఫిడెంట్ గా పూరి విజ‌య్ తో ముందుకెళ్లిపోయారు.

స్ర్కిప్ట్ పై న‌మ్మ‌కంతోనే పూరి అంత ధీగామా ఉన్నారు. `జేజీఎమ్` తో దేవ‌ర‌కొండని ఓ సూప‌ర్ స్టార్ లా తీర్చిదిద్దుతాన‌ని కంక‌ణం క‌ట్టుకుని మ‌రీ పూరి రంగంలోకి దిగిపొయారు. మే లో ఈ సినిమా రెగ్య‌లర్ షూటింగ్ చేయ‌డానికి పూరి రెడీ అవుతున్నారు. దాదాపు మొద‌టి షెడ్యూల్ అంతా ముంబైలో నే ఉంటుంది. అటుపై కాశ్మీర్ బోర్డర్ కి వెళ్ల‌నున్నారు. ఆర్మీబ్యాక్ డ్రాప్ స్టోరీ కావ‌డంతో ఈ సినిమా షూటింగ్ కి పూరి ఎక్కువ రోజులే స‌మ‌యం కేటాయించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఇదే స‌మ‌యంలో విజ‌య్ మ‌రో సినిమా షూటింగ్లో కూడా బిజీ కావాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసారు. ఇటీవలే సెట్స్ కి వెళ్లిన యూనిట్ మొద‌టి షెడ్యూల్ ని దిగ్విజ‌యంగా ముగించింది. ప్ర‌స్తుతం శివ అండ్ క్రూ విశ్రాంతిలో ఉంది. త‌దుప‌రి షెడ్యూల్ కి రెడీ అవుతోంది. అయితే మే లో గ‌నుక పూరి సినిమా మొద‌లైతే రెండు సినిమా షూటింగ్ ల‌కు విజ‌య్ ఒకేసారి హాజ‌రు కావాల్సి ఉంది.

రెండు వేర్వేరు చోట్ల షూటింగ్ జ‌రిగే అవ‌కాశం ఉంది. శివ సినిమా హైద‌రాబాద్లో షూట్ జ‌రుగుతుంటే..పూరి సినిమా ముంబైలో జ‌రుగుతుంది. ఆ లెక్క‌న విజ‌య్ ముంబై టూ హైద‌రాబాద్ జ‌ర్నీ త‌ప్ప‌దు. ఈ ఏడాది చివ‌ర‌క‌ల్లా రెండు సినిమా షూటింగ్ లు పూర్తి చేసి రిలీజ్ చేయాన‌ల్న‌ది ప్లాన్ గా క‌నిపిస్తుంది. కుద‌ర‌క‌పోతే వ‌చ్చే ఏడాది ఆరంభంలోనైనా చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌ .

శివ సినిమాలో విజ‌య్ కి హీరోయిన్ గా స‌మంత‌..జాన్వీ క‌పూర్ ల‌లో ఒక‌రు ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. జాన్వీ పేరే బ‌లంగా వినిపిస్తుంది. మ‌రి ఎవ‌రిని ఎంపిక చేసారు? అన్న‌ది యూనిట్ అధికారికంగా రివీల్ చేస్తే గానీ క్లార‌టీ రాదు.