Begin typing your search above and press return to search.
రాజమౌళి ఒకే ఒక్కసారి దెబ్బలు తిన్నాడు
By: Tupaki Desk | 25 July 2015 3:50 PM GMTప్రతి తండ్రీ కొడుకును ఏదో ఒక సమయంలో ఒక్క దెబ్బయినా కొడతాడు. అందుకు తాను కూుడా మినహాయింపు కాదంటున్నారు విజయేంద్ర ప్రసాద్. తాను కూడా రాజమౌళి ని ఓసారి కొట్టానన్నారు.
ఆ అనుభవం గురించి చెబుతూ.. ‘‘రాజమౌళి అమ్మకూచిగానే పెరిగాడు. మామూలుగా పిల్లల్ని కొట్టే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. కానీ ఒక్కసారి మాత్రం వాణ్ని కొట్టాల్సి వచ్చింది. ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి నేలమీద ఒక లైనులో పాకుతూ వెళ్తున్న చీమల్ని నలుపుతూ చంపడం గమనించాను. వెంటనే పిర్ర మీద గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాను. ఏడ్చాడు. ఎత్తుకుని సముదాయించాను. ఇప్పుడు నిన్నెందుకు కొట్టానో తెలుసా.. అని అడిగాను. ఏడుస్తూనే తెలియదన్నాడు. ఎందుకు ఏడ్చావని అడిగాను. నొప్పి అన్నాడు. ‘నువ్వు నలిపినప్పుడు చీమలకు కూడా అలాగే నొప్పి పుడుతుంది. జీవహింస మహాపాపం. ఇతరుల్ని ఎప్పుడూ అలా బాధ పెట్టకూడదు' అని చెప్పాను. ఈ ఒక్క సందర్భంలో మినహా రాజమౌళిని నేనెప్పుడూ కొట్టలేదు’’ అని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్.
కొడుకు సాధించిన విజయాల పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. బాహుబలి హాలీవుడ్ స్థాయిలో విజయవంతమవడం భగవత్ సంకల్పమని.. ఈ విజయం తాలూకు గర్వం రాజమౌళి తలకు ఎక్కకూడదని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. రాజమౌళిని ఇంటర్మీడియట్ తర్వాత చదివించడానికి తన ఆర్థిక స్థోమత సరిపోలేదని.. దీంతో అతను కూడా సినిమా పరిశ్రమకు వచ్చేశాడని.. కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర మూడేళ్లు అసిస్టెంటుగా పనిచేశాక.. క్రాంతి కుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో చేరాడని.. సినిమాల్లోకి వచ్చాకే అతడిలో ఓ అంకితభావం, స్పార్క్ చూశానని అన్నారు.