Begin typing your search above and press return to search.
#RRR : సింగిల్ బొమ్మే కాని డబుల్ కంటెంట్
By: Tupaki Desk | 19 Dec 2019 1:42 PM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి చిత్రాన్ని మొదట సింగిల్ పార్ట్ గానే అనుకున్నాడు. కాని కథ పెరగడం మరియు బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల రెండు పార్ట్ లు గా తెరకెక్కిస్తే అన్ని విధాలుగా బాగుంటుందని భావించారు. అందుకే బాహుబలి సినిమాను రెండు పార్ట్ లుగా తీసుకు వచ్చారు. ఆ రెండు పార్ట్ లు కూడా సెన్షేషనల్ సక్సెస్ గా నిలిచాయి. ముఖ్యంగా బాహుబలి 2 చిత్రం ముందు బాలీవుడ్ చిత్రాలు కూడా నిలువలేక పోయాయి. ఇప్పుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ ను సింగ్ పార్ట్ గానే మొదలు పెట్టిన జక్కన్న చివరకు రెండు పార్ట్ లుగా ఏమైనా మార్చుతున్నాడా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై రాజమౌళి తండ్రి.. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించాడు. ఒక రేడియో కార్యక్రమంలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ ను ఆర్ ఆర్ ఆర్ సినిమా సింగిల్ బొమ్మేనా లేదంటే బాహుబలి మాదిరిగా రెండు పార్ట్ లుగా వస్తుందా అంటూ ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ ఆర్‌ఆర్‌ఆర్ ఖచ్చితంగా సింగిల్ బొమ్మే కాని డబుల్ కంటెంట్ ఉంటుందంటూ సినిమాపై అంచనాలు పెంచాడు.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండా.. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రను చేస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.