Begin typing your search above and press return to search.

కాపీ కొట్టమనే చెబుతున్నారా సారూ?

By:  Tupaki Desk   |   6 Nov 2017 6:21 AM GMT
కాపీ కొట్టమనే చెబుతున్నారా సారూ?
X
టాలీవుడ్ లో టాప్ రచయితలలో ఒకరైన విజయేంద్ర ప్రసాద్ రాసే కథలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. దర్శకుడు గా ఆయన బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోకపోయినా కూడా రచయితగా మాత్రం చాలా సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఆయన తనయుడు రాజమౌళి సినిమాలకు కథలను అందించేది ఆయనే అని అందరికి తెలిసిందే.

అయితే ఇటీవల రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ - తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా ‘సినీ - టెలివిజన్ దర్శకుల శిక్షణా శిబిరాలను నిర్వహించారు. చివరిరోజు అయిన ఆదివారం రోజు ప్రముఖ రచయితలు హాజరయ్యారు. విజయేంద్ర ప్రసాద్ తో పాటు యండమూరి వీరేంద్రనాథ్ కెమెరామెన్ ఎం.వి.రఘు తదితరులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి అభిప్రాయాన్ని అనుభవాలను తెలిపారు.

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆయన అనుభవం గురించి రచయిత లు గుర్తుపెట్టుకోవాల్సిన విషయలెన్నో చెప్పారు. ముఖ్యంగా ఒక కథను చూసి స్పూర్తి పొందాలి. అంతే కాని కాపీ కొట్టకూడదు. రెండిటి మధ్య చాలా తేడా ఉంది అనే విధంగా ఒక మంచి ఉదాహరణను చెప్పారు. చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం అనే సినిమా స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్ లో భజరంగీ భాయిజాన్ సినిమాను అందించాను అని ఆయన వివరించారు.

అంటే స్వయంగా ఆయనే పాత సినిమాలను కాపీ చేయండి అంటున్నారా? లేదంటే కాపీ చేసినా తెలియకుండా ఉండాలి అని చెబుతున్నారా? ఏదేమైనా కూడా రాజమౌళి సినిమాల్లోనే చాలా కాపీ సీన్లు కంటెంట్లు ఉంటున్న దరిమిళా.. ఈ కామెంట్లను జనాలు ఎలా అర్ధం చేసుకుంటారో చూడాలి.