Begin typing your search above and press return to search.

#RRR : ఆ బాధ్యత విజయేంద్ర ప్రసాద్‌ తీసుకున్నాడట!

By:  Tupaki Desk   |   3 May 2020 9:10 AM GMT
#RRR : ఆ బాధ్యత విజయేంద్ర ప్రసాద్‌ తీసుకున్నాడట!
X
తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. తెలుగులో చాలా ఏళ్ల కాలంగా ఎదురు చూస్తున్న సూపర్‌ స్టార్స్‌ మల్టీస్టారర్‌ చిత్రం ఈ సినిమాతో నెరవేరబోతుంది. రాజమౌళి ఈ చిత్రంను భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. జక్కన్న ఏం చేసినా కూడా అద్బుతమే అంటున్నారు. కాని ఇద్దరు స్టార్‌ హీరోలను బ్యాలన్స్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా సుదీర్ఘ కాలంగా పోటీ పడుతూ వస్తున్న మెగా.. నందమూరి ఫ్యామిలీ హీరోల ఫ్యాన్స్‌ ను సంతృప్తి పర్చడం చాలా కష్టంతో కూడుకున్న విషయం.

సినిమాలో ఇద్దరి పాత్రలను బ్యాలన్స్‌ చేస్తూ సమానమైన స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఇవ్వడంతో పాటు పాత్రల్లో ఎవరిది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవల్సి ఉంటుంది. ఆ విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ చూసుకున్నట్లుగా సంగీత దర్శకుడు కీరవాణి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమాలోని సీన్స్‌ విషయంలో ఫ్యాన్స్‌ మద్య ఎలాంటి గొడవ లేకుండా ఇద్దరు హీరోలకు సమాన ప్రాముఖ్యత ఇస్తూ స్క్రీన్‌ ప్రజెన్స్‌ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ స్క్రీన్‌ ప్లేను విజయేంద్ర ప్రసాద్‌ రాసినట్లుగా ఆయన చెప్పారు.

రాజమౌళి బాహుబలి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. అద్బుతమైన విజువల్స్‌ తో మరోసారి ఆర్‌ ఆర్‌ ఆర్‌ చిత్రాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈయన తెరకెక్కిస్తున్నాడు. ఈ సమయంలో హీరో మద్య బాల్యన్స్‌ ను సరిగా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టేలా వసూళ్లు దక్కడం ఖాయమంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.