Begin typing your search above and press return to search.
బాహుబలి-2పై ఆ ప్రభావమేమీ లేదట
By: Tupaki Desk | 9 Dec 2015 11:30 AM GMTఒక హిట్టు సినిమాకు సీక్వెల్ ఇంకో సినిమా వస్తుంటే ఆటోమేటిగ్గా అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది బాహుబలి లాంటి మెగా బ్లాక్ బస్టర్ కు కొనసాగింపుగా వచ్చే సినిమా అంటే ఇక అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి విడుదలకు ముందు సౌత్ ఇండియా వరకు మాత్రం చర్చ జరిగింది. కానీ విడుదల తర్వాత ‘బాహుబలి’ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. బాహుబలి-ది కంక్లూజన్ కోసం ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇంకా షూటింగ్ కూడా మొదలవకముందే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. జక్కన బృందంపై అంచనాలు మరింతగా బాధ్యత పెరిగింది.
మరి ఈ పరిస్థితుల్లో పెరిగిన అంచనాల్ని అందుకునేందుకు స్క్రిప్టు విషయంలో కొత్తగా ఏమైనా మార్పులు చేశారా.. బాహుబలి-1 విడుదల తర్వాత వచ్చిన హైప్ ప్రభావం బాహుబలి-2 మీద పడుతోందా అని అడిగితే.. అలాంటిదేమీ లేదని అంటున్నాడు విజయేంద్ర ప్రసాద్. ‘‘బాహుబలి సాధించిన విజయం గురించి.. దాని సంచలనాల గురించి మేమంతా కూర్చుని మాట్లాడుకున్నాం. కానీ ఆ ప్రభావంతో ఒరిజినల్ స్క్రిప్టులో ఎలాంటి మార్పులు చేయాలని అనుకోలేదు. కొంత పాలిషింగ్ చేశాం తప్పితే కథలో మార్పులంటూ ఏమీ చేయలేదు’’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. బాహుబలి సినిమాకు సంబంధించి తాను రాసిన తొలి సన్నివేశం కట్టప్ప బాహుబలిని చంపడానికి సంబంధించిందే అని.. దాని చుట్టూనే కథ అల్లానని వెల్లడించారు విజయేంద్ర. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నతో పాటు అన్ని సందేహాలకూ బాహుబలి-2 సమాధానాలిస్తుందని ఆయన చెప్పారు.