Begin typing your search above and press return to search.
బాహుబలి తెలుగు సినిమా కాదు
By: Tupaki Desk | 21 July 2015 11:51 AM GMTఅచ్చ తెలుగు సినిమాను పట్టుకుని తెలుగు సినిమా కాదంటారేంటనుకుంటున్నారా? ఇది ఎవరో గిట్టని వాళ్లంటున్న మాట కాదు. బాహుబలి కథకుడు, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెబుతున్న మాట ఇది. ఐతే ఆయన వేరే ఉద్దేశంతో ఈ మాట చెప్పట్లేదు. ‘బాహుబలి’ని కేవలం తెలుగు సినిమాగా పరిగణించవద్దని.. ఇది భారతీయ సినిమా అని అంటున్నారాయన. దేశమంతా ఈ సినిమా సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తోందని ఆయన అన్నారు.
‘‘బాహుబలి విజయం భారతీయ సినిమాకు చెందుతుంది. తెలుగు సినిమాకు గర్వకారణంగా చెప్పుకుంటున్నప్పటికీ దీనికి కేవలం ఓ ప్రాంతీయ భాషా చిత్రంగా హద్దులు పెట్టేయకూడదు. బాహుబలి సినిమాను దేశమంతా దగ్గరికి తీసుకుంది. అన్ని భాషల్లోనూ సినిమా పెద్ద విజయం సాధించింది. తద్వారా ఇది ఏ ఒక్క భాషకో పరిమితం కాదని రుజువైంది. భారతీయ సినిమాకే ‘బాహుబలి’ గర్వకారణం’’ అని అన్నారు విజయేంద్ర ప్రసాద్.
బాహుబలి విజయం తమ కంటే కూడా ప్రేక్షకులకే చెందుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ‘‘ఏ సినిమా ఫలితాన్నయినా నిర్ణయించాల్సింది ప్రేక్షకులే. ఓ సినిమా హిట్టవుతుందని ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వలేరు. బాహుబలి మొదలుపెట్టే ముందు తాను ఓ బ్లాక్ బస్టర్ తీయబోతున్నట్లు భావించలేదు. ప్రపంచమంతా ఆమోదించే ఓ సినిమా చేయాలన్న లక్ష్యంతో బాహుబలి మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ విషయమే రుజువైంది’’ అన్నారు.