Begin typing your search above and press return to search.
బాహుబలి రైటర్ ఆ కాంట్రవర్సీ తీస్తున్నాడా?
By: Tupaki Desk | 23 April 2016 4:32 AM GMTదర్శకధీరుడు రాజమౌళి తండ్రిగానే కాకుండా.. బాహుబలి - భజరంగీ భాయ్ జాన్ తర్వాత కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్ పేరు మార్మోగిపోతోంది. జాతీయ స్థాయిలో రైటర్ గా గుర్తింపునే కాదు.. ఖ్యాతి దక్కించుకున్న ఈయన.. ఇప్పుడో వివాదాస్పద చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు.
మేరా భారత్ మహాన్ అంటూ విజయేంద్ర ప్రసాద్ సన్నీ డియోల్ కు ఓ స్టోరీ ఇస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు వివాదాస్పదమైన బాబ్రీ మసీదు కూల్చివేతపై ఈయన ఓ కథ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇప్పటికే 'కబీర్' అనే టైటిల్ కూడా పెట్టారట. దాదాపు పాతికేళ్ల క్రితం బాబ్రీ మసీద్ కూల్చివేసిన ఘటన అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే స్థాయిలో వివాదం కంటిన్యూ అవుతున్న ఏకైక కాంట్రవర్సీ ఇదే.
ఈ సబ్జెక్టునే థీమ్ గా తీసుకుని స్టోరీ రాస్తున్నాడట విజయేంద్ర ప్రసాద్. ఇప్పటికే లీడ్ రోల్ లో నటించడానికి అజయ్ దేవగన్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే.. ఈ మూవీ ఏ మతానికి అనుకూలంగాను, వ్యతిరేకంగాను కాకుండా.. అప్పుడు చెలరేగిన హింస కారణంగా ఓ సామాన్యుడు అనుభవించిన బాధగా ఉంటుందని సమాచారం. అన్నిటికంటే పెద్ద న్యూస్ ఏంటంటే.. ఈ బాలీవుడ్ మూవీని విజయేంద్ర ప్రసాద్ స్వయంగా దర్శకత్వం వహించనుండడమే.