Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్‌.. రాజ‌మౌళి హీరోలే కాదట‌

By:  Tupaki Desk   |   28 April 2017 4:50 AM GMT
ప్ర‌భాస్‌.. రాజ‌మౌళి హీరోలే కాదట‌
X
బాహుబ‌లి అన్న వెంట‌నే గ‌ర్తుకొచ్చేది జ‌క్క‌న్నే. శిల్పాన్ని చెక్కినంత శ్ర‌ద్ధ‌గా సినిమాను చెక్క‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. నెల‌లు.. సంవ‌త్స‌రాలు లాంటివి అస్స‌లు ప‌ట్ట‌న‌ట్లుగా.. ప‌ట్టించుకోన‌ట్లుగా క‌నిపిస్తూ.. తాను అనుకున్న‌ది వ‌చ్చే వ‌ర‌కూ విడిచిపెట్ట‌ని వైనం ఆయ‌న‌కు సొంతం. తెలుగు సినిమా రేంజ్‌ ను ఎవ‌రూ ఊహించ‌ని స్థాయికి తీసుకెళ్ల‌టంలో స‌క్సెస్ అయిన రాజ‌మౌళిని.. బాహుబ‌లి అస‌లుసిస‌లు హీరోగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు.

ప్ర‌భాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా.. హీరో త‌ర్వాతే. కానీ.. బాహుబ‌లి విష‌యంలో మాత్రం అందుకు రివ‌ర్స్ అని చెప్పాలి. తెర‌పైన బాహుబ‌లిని చూసిన‌ప్పుడు.. వాటిని పోషించిన వారు అస్స‌లు క‌నిపించ‌కుండా..కేవ‌లం పాత్ర‌లు మాత్ర‌మే క‌నిపించ‌ట‌మే కాదు.. అడుగ‌డుగునా రాజ‌మౌళి మాత్ర‌మే క‌నిపించే వైనం ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి.

బాహుబ‌లికి తెర మీద ప్ర‌భాస్ హీరో అయితే.. తెర వెనుక హీరో క‌చ్ఛితంగా రాజ‌మౌళేన‌ని చెబుతుంటారు. అయితే.. ఆ మాట‌లో అస్స‌లు నిజం లేద‌ని.. ఆ మాట‌కు వ‌స్తే.. ప్ర‌భాస్‌.. రాజ‌మౌళి ఇద్ద‌రూ హీరోలుకాద‌ని.. ఈ సినిమా క‌థ‌ను న‌మ్మి వంద‌ల కోట్లు పెట్టుబ‌డి పెట్టిన నిర్మాత‌లే అస‌లుసిస‌లు హీరోలుగా వ్యాఖ్యానించారు రాజ‌మౌళి తండ్రి.. బాహుబ‌లి క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.

బాహుబ‌లికి సంబంధించినంత‌వ‌ర‌కూ ప్ర‌భాస్‌.. రాజ‌మౌళి హీరో అన‌టం స‌రికాద‌ని.. రూ.70.. 80 కోట్ల పెట్టుబ‌డే ఎక్కువ‌నే రోజుల్లో.. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా.. ఇంత భారీ ఎత్తున పెట్టుబ‌డి పెట్టిన నిర్మాత‌ల ధైర్యంతోనే బాహుబ‌లి క‌ల సాకార‌మైంద‌ని వ్యాఖ్యానించారు. క‌థ‌ను న‌మ్మి తీసిన సినిమాగా చెబుతూ.. అల‌నాటి చ‌క్ర‌పాణి.. నాగిరెడ్డి లాంటి నిర్మాత‌లు బాహుబ‌లి నిర్మాత‌లంటూ ఆయ‌న కాంప్లిమెంట్ ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/