Begin typing your search above and press return to search.

బాహుబలికి అవార్డ్ ఇవ్వడం కరెక్టే

By:  Tupaki Desk   |   12 April 2016 5:00 AM GMT
బాహుబలికి అవార్డ్ ఇవ్వడం కరెక్టే
X
బాహుబలికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు ఇవ్వడంపై బోలెడన్ని విమర్శలు ఉన్నాయి. స్టోరీ పరంగా ఎన్నో మంచి సినిమాలు ఉండగా.. ఎక్కువ మందికి నచ్చిందనో, గ్రాఫిక్స్ ఉన్నాయనో ఏదో ఓ కారణంతో.. బాహుబలి ది బిగినింగ్ కు అవార్డ్ ఇవ్వడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. అసలు స్టోరీ ఏ మాత్రం లేకుండా.. కేవలం కేరక్టర్ల పరిచయంతో సినిమా పూర్తి చేసేసిన సినిమాకి అవార్డ్ ఎలా వస్తుందన్నది వీరి వాదన.

అయితే.. ఈ విమర్శలను బాహుబలి కథారచయిత - దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఖండించాడు. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లో చూసిన సినిమాకి అవార్డ్ ఇవ్వడం సబబే అంటున్నాడు విజయేంద్ర ప్రసాద్. ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలని, బాహుబలి లాంటి మూవీకి అవార్డ్ ఇవ్వడం ద్వారా.. ఎంతో మందికి ఇలాంటివి రూపొందించడంపై స్ఫూర్తి కలుగుతుందని అన్నాడీయన.

అసలు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని, థియేటర్లలో విడుదల కూడా కాని సినిమాలకు అవార్డులు ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఏంటి అన్నది విజయేంద్ర ప్రసాద్ ప్రశ్న. ఈయన యాంగిల్ లో కరెక్టే అనిపిస్తోంది కదూ.!!