Begin typing your search above and press return to search.

పవన్ కథపై బాహుబలి రైటర్ క్లారిటీ

By:  Tupaki Desk   |   17 May 2017 6:13 AM GMT
పవన్ కథపై బాహుబలి రైటర్ క్లారిటీ
X
బాహుబలి2 ఇప్పుడు 1500 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించబోతోంది. తొలిసారిగా వెయ్యి కోట్ల క్లబ్ ను ఓపెన్ చేసిన బాహుబలి2.. అనూహ్యందా 1500 కోట్ల స్థాయిని కూడా చేరుకుంటోంది. తమ సినిమా పెద్ద హిట్ అవుతుందని ముందే ఊహించినా.. ఇంతటి రేంజ్ కు చేరుకుంటుందని తాము కూడా ఊహించలేదని అంటున్నాడు రైటర్ విజయేంద్రప్రసాద్.

బాహుబలి2 రైటర్ తర్వాత ఈయన తరచుగా పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి. బాహుబలి రెండో భాగంలో ఇంటర్వెల్ సీన్ ను.. పవన్ కళ్యాణ్ క్రేజ్ బేస్ చేసుకుని రాశానని చెప్పడం సంచలనం అయింది. అయితే.. ప్రస్తుతం ఈయన పవర్ స్టార్ కోసం ఓ కథ రాస్తున్నాడనే టాక్ వినిపించింది. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చాడు విజయేంద్ర ప్రసాద్. ఇప్పటివరకూ అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని అన్నాడయన. 'తన కోసం కథ రాయమని పవన్ కళ్యాణ్ నన్ను అడగలేదు. అలాగే నేను ఏ కథతోను పవన్ ను సంప్రదించలేదు. ఈ రూమర్స్ అన్నీ బాహుబలి2 ఇంటర్వెల్ సీన్ గురించి పవన్ క్రేజ్ పై నేను చేసిన కామెంట్స్ కారణంగానే పుట్టాయి' అన్నాడు విజయేంద్ర ప్రసాద్.

ఈ రైటర్ ఇచ్చిన క్లారిటీతో.. విజయేంద్ర ప్రసాద్ ప్రసాద్ కథతో పవన్ సినిమా అన్నది ఒట్టి రూమర్ అని తేలిపోయినట్లే. ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ చేస్తున్న పవన్.. ఆ తర్వాత ఆర్టీ నీసన్ తోను.. అలాగే జాలీ ఎల్ఎల్బీ రీమేక్ లోనూ నటిస్తాడని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/