Begin typing your search above and press return to search.
మీ అందరీకీ ఒక షాక్:బాహుబలి బ్రతికే వుండచ్చు
By: Tupaki Desk | 13 April 2016 5:15 AM GMTగత ఏడాది యావత్ భారత దేశాన్ని ఊపేసిన ప్రశ్నలలో ఒకటి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకు సమాధానంగా ఎన్నో స్కిట్ లు - జోకులు - ఊహలు బయటకొచ్చిన సమయంలో బాహుబలి సిరీస్ ల రచయితా విజయేంద్ర ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనాలకు దారితీస్తున్నాయి.
ఆయన్ని ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్న కామనే గాబట్టి ముందే పంచ్ రెడీ చేసి పెట్టుకుంటున్నారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నకు బాహుబలిని కట్టప్ప చంపలేదు, జస్ట్ పొడిచాడు అంతే అని సమాధానం ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళి అదే ప్రశ్నకు బాహుబలి చనిపోయాడని ఎందుకు అనుకుంటున్నారు? బ్రతికివుండే అవకాశాలు కూడా వున్నాయిగా అంటూ కొత్త ఆశలు రేకెత్తించారు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ నిజమైతే బాహుబలి రెండో భాగంలో ఇద్దరు ప్రభాస్ లు కనువిందు చేసే ఆస్కారం వుంది.
అంతేకాక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పురాణాలలో కీలక పాత్రలను తలపిస్తాయని తెలిపాడు. కట్టప్పా భీష్ముడికి ప్రతీక అని - కైకేయి - గాంధారి - కుంతీ పాత్రల మిశ్రమమే శివగామి పాత్రని - బిజ్జలదేవుడిలో శకునిని చూడచ్చని, భల్లాల దేవుడి అంతరాత్మ రావణ - దుర్యోధులకు సమమని ఇక బాహుబలి రాముడు - అర్జునుడికి సంకేతమని చెప్పుకొచ్చారు.