Begin typing your search above and press return to search.
రాజమౌళి అలాంటి కథ కావాలన్నాడు
By: Tupaki Desk | 17 May 2017 7:06 AM GMTబాహుబలి2 విజయాన్ని టీం అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన దర్శకుడిగా రాజమౌళి గుర్తింపు పొందితే.. ఇంతటి పెద్ద కల సాకారం అయేందుకు కథను అందించిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు కూడా పొగడ్తల వర్షం కురుస్తోంది. ఇలాంటి సమయంలో వీరి తర్వాతి సినిమాపై ఆసక్తి నెలకొంది.
రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే చాలా రూమర్స్ ఉన్నాయి. వీటన్నిటికీ తెర దించుతూ తన కొడుకు కొత్త సినిమాపై కొత్త కబుర్లు చెప్పారు విజయేంద్రప్రసాద్. 'తనకు ఎలాంటి కథ కావాలనే విషయంపై రాజమౌళి ఏమీ చెప్పలేదు కానీ.. ఎలాంటి స్టోరీ వద్దో మాత్రం చెప్పాడు. ఈసారి తీయబోయే సినిమాలో గ్రాఫిక్స్ అనే ఎలిమెంట్ ఏ మాత్రం ఉండకూడదని రాజమౌళి అన్నాడు. అందుకు తగ్గట్లుగానే కథ తయారు చేసే పనిలో ఉన్నాను' అన్నాడు విజయేంద్ర ప్రసాద్.
ఇప్పటికే ఓసారి ఈ విషయంపై రియాక్ట్ అయ్యాడు రాజమౌళి. వీఎఫ్ ఎక్స్ అందించిన కమల్ కణ్ణన్ తో పని లేకుండా తాను తర్వాతి సినిమా చేయాలని అనుకుంటున్నట్లు రాజమౌళి చెప్పాడు. ఇప్పుడు తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా ఇదే విషయాన్ని ఖాయం చేయడంతో.. రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ సామాజికంగానే తప్ప.. బాహుబలి టైపులో గ్రాండ్ ప్రాజెక్ట్ మాత్రం కాదనే విషయం తేలిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/