Begin typing your search above and press return to search.

భీం పాత్ర‌పై విజ‌యేంద్రప్ర‌సాద్ షాకింగ్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   1 April 2022 8:30 AM GMT
భీం పాత్ర‌పై విజ‌యేంద్రప్ర‌సాద్ షాకింగ్ కామెంట్స్‌
X
ట్రిపుల్ ఆర్‌.. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం ఈ పేరు మారుమ్రోగిపోతోంది. ఎక్క‌డా విన్నా.. చూసినా దీనిపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై ప్రారంభం నుంచే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దాదాపు మూడున్న‌రేళ్లుగా ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ ఎట్ట‌కేల‌కు ఈ మూఏవీ మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

విడుద‌లైన తొలి రోజు తొలి షో నుంచే ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా యునానిమ‌స్ టాక్ ని సొంతం చేసుకుంది.

కొమురం భీం పాత్ర‌లో న‌టించిన ఎర్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టించిన రామ్ చ‌ర‌ణ్ అద్భుతంగా న‌టించార‌ని ప్రేక్ష‌కులు వారిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. విదేశీయులు సైతం మ‌న తెలుగు సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూ యుఎస్ లోని డ‌ల్లాస్‌, లాస్ ఎంజిల్స్ కు సంబంధించిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేస్తున్నారు.

దీంతో ట్రిపుల్ ఆర్ కు విదేశీయుల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు రాని వారు కూడా తెలుగు సినిమాని చూస్తూ ఈ మూవీని మీరు కూడా చూడండి.. ఎంక‌రేజ్ చేయండి అంటూ ప్ర‌చారం చేస్తుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. బాహుశా ఓ తెలుగు సినిమాకు విదేశీయులు ప్ర‌చారం చేయ‌డం ఇదే తొలిసారేమో. అయితే ఈ విష‌యంలో ట్రిపుల్ ఆర్ అరుదైన ఘ‌న‌త‌ని సాధించిన‌ట్టే అంటున్నారు ట్రేడ్ జ‌నం.

ఇదిలా వుంటే ఈ చిత్రంలోని ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్ర‌పై ర‌చ‌యిత‌, రాజ‌మౌళి ఫాద‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమ‌రం భీం పాత్ర‌లో న‌టించారు. ఓ స‌న్నివేశంలో ఆయ‌న న‌టించిన తీరు ప్రేక్ష‌కుల హృద‌యాల్ని క‌దిలించేదిగా వుంది.

ఈ స‌న్నివేశం చూసిన వాళ్లంతా బ‌రువెక్కిన హృద‌యంతో భావోద్వేగానికి లోన‌వుతున్నారు. అంత అద్భుతంగా ఎన్టీఆర్ ఆ స‌న్నివేశంలో న‌టించి కంట‌త‌డి పెట్టించారు. కొమురం భీముడో.. కొమురం భీముడో.. అంటూ సాగే పాట‌లో ఎన్టీఆర్ అభిన‌యం స్పీచ్ లెస్ .. అని కొనియాడారు.