Begin typing your search above and press return to search.
సింహాద్రి గుట్టు విప్పిన బాహుబలి రైటర్
By: Tupaki Desk | 17 April 2017 4:58 AM GMTఏ సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్స్ వస్తూనే ఉంటాయి. ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ సాధిస్తూ.. స్టార్ హీరోలు ట్రెండ్ సెట్టర్స్ అయిపోతుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ని స్టార్ హీరోగా మార్చేసిన మూవీగా సింహాద్రి చిత్రానికి అరుదైన రికార్డ్ ఉంది. అప్పటికే యంగ్ టైగర్ కెరీర్ లో హిట్స్ ఉన్నా.. సింహాద్రి మాత్రం అప్పటివరకూ ఉన్న రికార్డులు అన్నిటినీ తుడిచేసింది.
ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అయితే.. కథ అందించిన రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఇప్పటి బాహుబలి మాదిరిగానే అప్పటికి ట్రెండ్ సెట్టర్ అయిన సింహాద్రికి కూడా కథ ఈయనే ఇచ్చారు. అయితే.. అసలు సింహాద్రి కథను ఎన్టీఆర్ కోసం రాయలేదంటూ చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. అంతే కాదు.. ఈ స్టోరీ బాలయ్య కోసం రాయగా ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదని.. దీంతో కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఎన్టీఆర్ అనుగుణంగా మార్చి.. అప్పుడు యంగ్ టైగర్ కు కథ వినిపించాడట దర్శకుడు.
ఆ తర్వాత ఏం జరిగిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇటు ఎన్టీఆర్ ని స్టార్ హీరోగా.. రాజమౌళిని స్టార్ డైరెక్టర్ గా మార్చేసిన మూవీ సింహాద్రి. ప్రస్తుతం ఈయన అందించిన కథతో రూపొందిన బాహుబలి-కట్టప్ప సస్పెన్స్ ను.. తెలుసుకునేందుకు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/