Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్' కు పోటీగా విజయేంద్ర ప్రసాద్ ''సీత''.. రావణుడు ఎవరంటే..?
By: Tupaki Desk | 25 May 2021 9:38 AM GMT'రామాయణం'.. ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు విన్నా తనవి తీరని మహాకావ్యం అంటుంటారు. అందుకే ఈ ఇతిహాసం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతోంది. అలానే దీనికి పోటీగా ప్రముఖ నిర్మాత మధు మంతెన.. సూపర్ స్టార్ మహేష్ బాబు - బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో 'రామాయణం' చిత్రాన్ని తీయాలని చూస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో 'బాహుబలి' 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ రామాయణం ఆధారంగా ''సీత: ది ఇంకార్నేషన్'' అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
విజయేంద్ర ప్రసాద్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్న ''సీత'' చిత్రానికి అలౌకిక్ దేశాయి దర్శకత్వం వహించనున్నారు. మిగిలిన రామాయణం సినిమాలకు దీనికి ప్రత్యేకత ఏంటంటే.. సీత కోణంలో ఈ రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సరికొత్త ‘సీత’ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. మనోజ్ ముంతాషీర్ సాహిత్య దీనికి సంభాషణలు సమకూరుస్తున్నారు. పూర్తిస్థాయి వీఎఫ్ఎక్స్ సాంకేతికతో రూపొందే ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు.
ఇదిలావుండగా ''సీత'' చిత్రంలో టైటిల్ రోల్ లో ఎవరు నటిస్తున్నారనే విషయంపై పలు వార్తలు వస్తున్నాయి. సీత పాత్రకు కరీనా కపూర్ లేదా ఆలియా భట్ లలో ఎవరో ఒకరిని ఎంపిక చేయనున్నారని టాక్ నడిచింది. ఈ క్రమంలో కరీనా అయితేనే బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్ - అలౌకిక్ లు అభిప్రాయపడ్డారని.. కరీనాతో ఇప్పటికే చిత్రబృందం సంప్రదించగా, అందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించారని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అలానే రావణుడి పాత్ర కోసం బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ‘పద్మావత్’ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించిన రణవీర్.. మరోసారి అలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి.