Begin typing your search above and press return to search.
రాజమౌళి కానీ నేను కానీ దానిని డీకోడ్ చేయలేం!- విజయేంద్ర ప్రసాద్
By: Tupaki Desk | 2 Jun 2021 6:42 AM GMTబాహుబలి ఫ్రాంచైజీ విజయవంతం అయిన తరువాత విజయేంద్ర ప్రసాద్.కె పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే రచయితలలో ఒకరిగా ఎదిగారు. భజరంగి భాయిజాన్ -మణికర్ణిక చిత్రాల విజయం వెనక ఆయన కలం బలం ఉంది. ప్రస్తుతం సీతాదేవి కథతో భారీ సినిమా తెరకెక్కుతోంది. దానికి ఆయన రచయిత. పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ రచయితగానూ ఆయన పేరు మార్మోగుతోంది. అంతటి గ్రేట్ రైటర్ అలీతో సరదాగా టాక్ షోలో ఎన్నో విషయాల్ని ముచ్చటించారు. రాజమౌళి తండ్రిగా తన కుమారుడి గుట్టు సరదా సంభాషణలో లీక్ చేశారు.
కె రాఘవేందర్ రావు ప్రోత్సాహంతోనే తాము సినిమాల్లోకి ప్రవేశించామని వెల్లడించారు. విజయేంద్ర ప్రసాద్ శివశక్తి దత్తా (కీరవాణి తండ్రి) తో కలిసి కథ చర్చల్లో పాల్గొనే వారు. రాఘవేందర్ రావు అతనిలో స్పార్క్ గమనించి ఇతరులతో పాటు జానకి రాముడు(1988) స్క్రిప్ట్ ను రాయడానికి విజయేంద్రునికి అవకాశం ఇచ్చారు. ఆ తరువాత, విజయేంద్ర ప్రసాద్ స్వతంత్ర రచయితగా విజయవంతమయ్యారు. యాదృచ్ఛికంగానే అయినా కే రాఘవేందర్ రావు రాజమౌళిని దర్శకుడిగా ప్రోత్సహించారు. విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. రాఘవేందర్ రావు రాజమౌళి ప్రతిభను గుర్తించి టిడిపి ప్రకటనలు చేయించారు. తరువాత శాంతి నివాసం సీరియల్ కి పని చేశారు. చివరికి అతను `స్టూడెంట్ నంబర్ -1` తో దర్శకుడయ్యారు.
విజయేంద్ర ప్రసాద్ కి పూరి ఫేవరెట్ డైరెక్టర్. అతడి చిత్రాన్ని తన ఫోన్ వాల్ పేపర్ గా ఉపయోగిస్తారట. పూరి పై తన అసూయను కూడా విజయేంద్రుడు వ్యక్తం చేశారు. హీరో - విలన్ మధ్య డివైడ్ ఏర్పడటానికి పూరి జగన్నాథ్ కేవలం ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు. అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాజమౌళి కానీ నేను కానీ దానిని డీకోడ్ చేయలేం. పోరాట సన్నివేశాన్ని తీసుకురావడానికి ముందు రాజమౌళికి కనీసం రెండు మూడు సన్నివేశాలు అవసరం. పూరి చాలా సులభంగా చేసేస్తారు.. అందుకే నేను అతనిపై అసూయ అని అన్నారు. నేను పూరీ జగన్ తోనూ ఇదే విషయాన్ని చెప్పాను.. అని తెలిపారు.
ఆర్.ఆర్.ఆర్ గురించి చెబుతూ... ఇందులో మంచి వర్సెస్ మంచి పోరాటం ప్రజల్ని ఉద్వేగానికి గురి చేస్తుందని తెలిపారు. తారక్ వర్సెస్ రామ్ చరణ్ పోరాటం అభిమానుల్ని ఉద్వేగానికి గురి చేస్తుందని ఆ ఇద్దరూ మంచి కోసం పోరాడుతూనే ఒకరితో ఒకరు తలపడే సన్నివేశం ఉంటుందని కూడా తెలిపారు. ఆ సన్నివేశాన్ని ఇప్పటికే తెరకెక్కించిన విధానం చూశాను. చాలా బాగా వచ్చిందని అన్నారు.
విజయేంద్ర ప్రసాద్ భార్య నందిని 2012 లో మరణించారు. దాదాపు 6 నెలలు కోమా స్థితిలో ఉన్న తన భార్య హృద్రోగంతో మరణించారని వెల్లడించారు. ఆమెకు మొదట స్ట్రోక్ వచ్చింది. ఇది కోమా స్థితికి దారితీసింది. కోమా నుండి బయటకు వస్తే ఆమె స్తంభించిపోతుందని వైద్యులు మాకు చెప్పారు. ఆమెను తిరిగి ఆరోగ్యకరమైన స్థితికి తీసుకురావాలని లేదా తనవద్దకు తీసుకెళ్లాలని నేను దేవుడిని ప్రార్థించాను. పక్షవాతం తో జీవించడం నరకం లాంటిది. ఆమెను అలా చూడాలనుకోలేదు అని విజయేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు. రాజమౌళి విజయాన్ని చూసేందుకు తాను ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
విజయమంద్ర ప్రసాద్ రాజమౌళి కోసం ఒక కథ రాసినట్లు ప్రకటించారు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి భారీగా తెరెక్కాల్సినది. పనులు జరుగుతున్నాయని త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. మహేష్ కోసం ఆయన ఎలాంటి కథ రాస్తారని అడిగినప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఆ కథ రాయడానికి పూరి జగన్నాథ్ సహాయం కోరతానని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే మహేష్ బాబు కోసం ఒక కథ కోసం పని చేస్తున్నారు. ఇది రాజమౌలి తదుపరి చిత్రం. దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
రజనీకాంత్ రావణుడిగా కనిపించాలని అమితాబ్ దుఃఖంతో ఉండే పాత్రలో నటించలని కోరుకున్నారు. అవి తానే రాస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి కథ రాస్తానని అడిగినప్పుడు.. పవన్ చిత్రానికి కథ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు అతనిని చూడటానికి మాత్రమే అతని సినిమాలకు వస్తారు. మేము కొన్ని పాటలు కొన్ని పోరాట సన్నివేశాలను జోడిస్తే సరిపోతుంది. చివరికి అతను ప్రజలకు మంచి చేస్తున్నాడని మేము జోడిస్తే చాలు అది వర్కవుటవుతుందని అన్నారు. అతని అన్ని చిత్రాల నుండి బిట్స్ తీసుకోవచ్చు. సులభంగా రాసేయొచ్చని అన్నారు.