Begin typing your search above and press return to search.
రాజమౌళి తండ్రికి పెద్ద బాధ్యత
By: Tupaki Desk | 17 Dec 2015 11:57 AM GMTవిజయేంద్ర ప్రసాద్... రాజమౌళి తండ్రిగా తెలియడానికి ముందే ఆయన కథా రచయితగా పాపులర్. ఈ ఏడాది ఏకంగా రెండు భారీ విజయాలు దక్కించుకున్న సినిమాలకు ఆయన కథ ఇవ్వడంతో ఆయన పేరు ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీలో మారుమోగిపోయింది. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి కథ అందించింది విజయేంద్ర ప్రసాదే. అంతేకాదు... బాలీవుడ్ లో ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాగా నిలిచిన భజరంగీ భాయ్ జాన్ కథ కూడా ఆయనదే. అలాంటి సూపర్ హిట్ సినిమాల రచయితకు ఇప్పుడు పెద్ద బాధ్యత ఒకటి అప్పగించారు. మాజీ ప్రధాని దేవగౌడ మనువడు... కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార స్వామి తెరంగేట్రం చేయనున్న సినిమాకు విజయేంద్ర ప్రసాద్ నే కథ రాయమని కోరారట. దాంతో ఇప్పటికే ఆయన చాలావరకు పనిపూర్తిచేశారట.
రాజకీయ కుటుంబం నుంచి వస్తున్న నిఖిల్ సినిమా కన్నడ నాట అదిరిపోయేలా ఉండాలని... మంచి మాస్ ఎంటర్ టైనర్ గా ఉండాలని చెబుతూ స్ట్రాంగ్ కథ రాయమని కోరారు. దీంతో విజయేంద్ర ప్రసాద్ ఆ బాధ్యతలో ఇమిడిపోయారు. జాగ్వార్ పేరుతో వస్తున్న ఈ సినిమా పోస్టర్లు లాంఛ్ కావడంతో వాటిని చూస్తున్న వారు భారీ మాస్ ఎంటర్ టైనర్ కానుందని అంటున్నారు. మొత్తానికి దేవగౌడ మనవడిని విజయేంద్ర ప్రసాద్ స్టార్ ని చేస్తారో లేదో చూడాలి.