Begin typing your search above and press return to search.
‘‘భాయ్ జాన్’’ క్రియేటర్ కి పాక్ కోరిక
By: Tupaki Desk | 23 July 2015 9:36 AM GMTమూడు వారాల వ్యవధిలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు కథ అందించటం సాధ్యమేనా? వేరెవరికో అసాధ్యమేమో కానీ.. అలాంటి క్లిష్టమైన ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు విజయేంద్రప్రసాద్.
సినిమా రికార్డుల దుమ్ము దులిపేసి సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్న బాహుబలి చిత్రానికి కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మరో ఘనత సాధించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో వంద కోట్ల కలెక్షన్ సాధించిన హిందీ సినిమా అన్న రికార్డును క్రియేట్ చేసిన భజరంగీ భాయ్ జాన్ చిత్రానికి కథ అందించింది విజయేంద్ర ప్రసాదే.
స్వల్ప వ్యవధిలో.. ఇలా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు కథను అందించిన రికార్డు విజయేంద్ర ప్రసాద్ దే. సల్మాన్ నటించిన భాయే జాన్ చిత్రంతో ఎంతో మంది కంట కన్నీరు తెప్పించి.. భావోద్వేగంతో ఊగిపోయేలా చేసిన విజయేంద్ర ప్రసాద్ కు తీరని కోరిక ఒకటి ఉండిపోయిందట. ఒక మూగ చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఒక భారత యువకుడు పాకిస్థాన్ కు అనుమతి లేకుండా ప్రవేశించి.. విజయవంతంగా తిరిగి రావటాన్ని కథాంశంగా తీసుకొని మలచిన చిత్రం.. రెండు దేశాల్లోనూ విపరీతమైన ఆదరణ పొందుతోంది.
ఆసక్తికరంగా ఇలాంటి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పటివరకు పాకిస్థాన్ కు వెళ్లలేదట. తనను ఎవరైనా పిలిస్తే.. పాకిస్థాన్ కు వెళ్లాలని ఉన్నట్లుగా తాజాగా పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజలకు భావోద్వేగభరితమైన సినిమా చూపించిన.. ‘‘భాయ్ జాన్ బాప్’’ విజయేంద్ర ప్రసాద్ కు పాకిస్థాన్ ఎవరు చూపిస్తారో..?